
తెలివితేటలు, క్రమశిక్షణ వంటి పదాలు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జ΄ాన్ దేశమే. వీరి ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి చేసే తయారు చేసే టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే, వీరు ఏ విషయాన్నైనా మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది అంతుచిక్కని విషయం. అందుకోసం వీరు కొన్ని టెక్నిక్స్ ను ఉపయోగిస్తారట. వీటివల్లే వారు అంత తెలివిగా ఉంటారంటారు. అవేంటో చూద్దాం..
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు మనం ప్రతిదానికీ కొత్తరకమైన విధానాన్ని వెదుక్కుంటున్నాం కానీ నిజానికి ఇవన్నీ మన దేశంలో వేదకాలం నుంచి అనుసరిస్తున్నవే. అందుకే వేదమంత్రాలలో తప్పులు దొర్లవు సాధారణంగా. ఎంతో పెద్దగా ఉండే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామాలు వంటి వాటిని మన వాళ్లు సులువుగా ధారణ చేసినట్టే వారికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో జపాన్ భాషలో చూద్దాం. మన సనాతన విధానంలో వాటిని అనుసరిద్దాం.
ఫురుసాటో టెక్నిక్ (జ్ఞాపకం కోసం)...
ఈ టెక్నిక్ సమాచారాన్ని మనకు సుపరిచితమైన స్థలాలు లేదా మనకే సొంతమైన కొన్ని జ్ఞాపకాలతో అనుసంధానించే సులువైన విధానం. అంటే మన స్వగ్రామంలోని ఒక ప్రదేశంతో సమాచారాన్ని లింకప్ చేయడం ద్వారా ఆ మేటర్‌తో భావోద్వేగ సంబంధం... అదేనండీ... ఎమోషనల్ బాండేజీని ఏర్పరచుకోవచ్చు. ఈ ఎమోషనల్ బాండేజ్ మన మెదడులో సమాచారాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది.
షిచిడా మెథడ్..
జపనీయులకు మెదడులో సమాచారాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచేందుకు సాయం చేసే పద్ధతులలో షిచిడా మెదడ్ కీలకమైనది. దీనిని వారికి పాఠశాల రోజులనుంచే బోధిస్తారు. ఈ విధానంలో సమాచారాన్ని రంగుల బొమ్మలు లేదా కథల రూపంలో ఊహించుకోవాలన్నమాట. ఉదాహరణకు, ఏదైనా ఒక సుదీర్ఘమైన జాబితాను ఒకదానిని గుర్తుంచుకోవాలంటే, దానిని ఒక కథగా మార్చి, మెదడు సృజనాత్మక భాగాన్ని ఉత్తేజపరచడం ద్వారా ఆ జాబితాను గుర్తుంచుకోవడం సులభమవుతుంది. ఈ విధానాన్ని జ΄ాన్ విద్యా విధానాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.
బూజన్ స్టైల్ అనేమైండ్ మ్యాపింగ్...
మైండ్ మ్యాపింగ్ అనేది సమాచారాన్ని దృశ్య రూపంలో రూపొందించే పద్ధతి. ఒక కేంద్ర ఆలోచన చుట్టూ సంబంధిత విషయాలను చిత్రం లేదా రేఖాచిత్రం రూపంలో అనుసంధానం చేయడం ఈ టెక్నిక్ ప్రధాన ఉద్దేశ్యం. దీనిద్వారా సమాచారాన్ని వ్యవస్థీకరించడంతో పాటు, దానిని సులభంగా గుర్తుంచుకోవచ్చునన్నమాట. జపాన్ విద్యార్థులు ఉగ్గుపాలనుంచే అంటే మరీ నిజంగానే ఉగ్గుపాలు అని కాదు... ఎలిమెంటరీ స్థాయినుంచే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
చంకింగ్ స్టైల్!
సంక్లిష్ట సమాచారాన్ని చిన్న, సులభమైన భాగాలుగా విభజించడం ఈ చంకింగ్ విధానం ముఖ్యోద్దేశం. జపాన్ కాంజీ అక్షరాలను నేర్చుకునే విధానం నుంచి ఈ టెక్నిక్ పుట్టింది. ఉదాహరణకు, ఒక పెద్ద సంఖ్యను గుర్తుంచుకోవాలంటే, దానిని చిన్న సమూహాలుగా విభజించి నేర్చుకోవడం ద్వారా మెదడుకు మెమరీ సులభం అవుతుంది. ఈ విధానం సమాచారాన్ని వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది.
స్పేస్డ్ రిపిటీషన్ (వల్లెవేయడం లేదా పునశ్చరణ)...
సమాచారాన్ని దీర్ఘకాలం గుర్తుంచుకోవడానికి స్పేస్డ్ రిపిటీషన్ అనేది శక్తిమంతమైన పద్ధతి. ఈ టెక్నిక్‌లో సమాచారాన్ని నిర్దిష్ట వ్యవధులలో... ఉదాహరణకు, ఒకటి, మూడు, ఐదురోజుల వరకు పునరావృతం చేయడం జరుగుతుంది. భాషను బోధించడంలో ఈ పద్ధతిని వారు ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట. మన పద్ధతిలో దానినే వల్లెవేయడం అంటారు. అంటే చదివిన దానిని క్రమంతప్పకుండా పునరావృతం చేయడం వల్ల మెదడు సమాచారాన్ని బలంగా నిలుపుకుంటుందన్నమాట.
ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ఎన్-బ్యాక్ టెక్నిక్
టెక్నిక్ మెదడు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని, ఏకాగ్రతను పెంచే మానసిక వ్యాయామం. ఈ పద్ధతిలో ఒక వరుసలోని అంశాలను కొన్ని దశల ముందు నుంచి గుర్తుచేసుకోవాలి. ఉదాహరణకు, రెండు లేదా మూడు అంశాల ముందు ఉన్న వాటిని గుర్తుంచుకోవడం. ఈ విధానం ద్వారా క్రమంగా మెదడు పనితీరు మెరుగుపడి, సమాచారాన్ని త్వరగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
చదవండి:ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?