ఉక్కు కూర

special story to food - Sakshi

గుడ్‌ ఫుడ్‌

గోంగూరకు కాస్త పుల్లటి రుచి ఉండటంతో... దాన్ని కోడికూరకు చేర్చి చికెన్‌గోంగూర అన్నా, పప్పుకు చేర్చి గోంగూర పప్పు అన్నా... అసలు కూరకు కొత్తరుచి వస్తుంది. అలా కొత్తరుచి తేవడంలో దానికి ఎంత స్పెషాలిటీ ఉందో... కొత్త రక్తం పట్టేలా చేయడమూ సాధ్యమవుతుందని గోంగూరకు ఒక ప్రతీతి ఉంది. గోంగూరలో ఐరన్‌ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల దాంతో మనకు కొత్తరక్తం పడుతుంటుంది. అదొక్కటే కాదు.... గోంగూరతో ఒనగూరే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... 

►గోంగూర చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. 
►గోంగూరలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అధిక రక్తపోటును నియంత్రించి, సాఫీగా రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. 
►గోంగూరలోని పాలీఫీనాలిక్‌ కాంపౌండ్స్, యాంథోసయనిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ లాంటి అనేక యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. క్యాన్సర్‌ సెల్‌ తనంతట తానే నశించేలా చేసే (అపాప్టోసిస్‌ను ప్రమోట్‌ చేసే) అద్భుతమైన గుణం గోంగూరకు ఉంది. ఫలితంగా క్యాన్సర్‌ ట్యూమర్‌లు నశించిపోయేలా చేస్తుంది.
►గోంగూరలో విటమిన్‌–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే శరీరానికి రోగనిరోధక శక్తిని సమకూర్చి, ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. 
►గోంగూరలో పీచు (ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గోంగూర మంచిది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుతుంది. 
►గోంగూరలోని విటమిన్‌–సి... ఏజింగ్‌కు కారణమయ్యే ఫ్రీరాడియల్స్‌ను హరించి, చాలాకాలం యౌవనంగా ఉండేలా చేయడంతో పాటు, చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top