ఎగిరే మోటర్‌బైక్‌..  ద స్పీడర్‌!

The spear Flying motorbike  - Sakshi

ట్రాఫిక్‌ పెరిగిపోతోందని చికాకు పడుతున్నారా? ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లగలిగితే భలే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. అమెరికన్‌ కంపెనీ జెట్‌ప్యాక్‌ ఏవియేషన్‌ ‘ద స్పీడర్‌’ పేరుతో ఎగిరే మోటర్‌బైక్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. కొన్నేళ్ల క్రితం వెన్నుకు తగిలించుకునే జెట్‌ప్యాక్‌ను తయారు చేసిన కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ద స్పీడర్‌ విషయానికి వస్తే.. ఇది చూడ్డానికి మోటర్‌బైక్‌ మాదిరిగా ఉంటుంది. కానీ నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. కాకపోతే దాదాపుగా బొక్కబోర్లా పడుకుని నడపాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు టర్బోజెట్‌ ఇంజిన్లు ఉంటాయి. గరిష్టంగా 15000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం దీని సొంతం.

దాదాపు 125 కిలోల బరువు మోసుకెళ్లగలదు. కిరోసిన్‌ లేదా విమాన ఇంధనం సాయంతో 22 నిమిషాలపాటు ఎగురగలదు. అది కూడా గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల వేగంతో! ఇంకోలా చెప్పాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చునన్నమాట. ప్రస్తుతానికి తాము 20 నమూనా బైక్‌లను మాత్రమే తయారు చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఐదు టర్బోజెట్ల ఇంజిన్లతో పైలట్‌ అవసరం లేని మైక్‌ల తయారీకి జెట్‌ప్యాక్‌ మిలటరీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతా బాగుంది కానీ.. ధర ఎంత అంటారా?  ఒక్కో ‘ద స్పీడర్‌’ ఖరీదు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మిలటరీ వెర్షన్‌ ఎంతన్నది మాత్రమే తెలియదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top