బరువుకు.. బ్రేక్‌ఫాస్ట్‌కూ లింక్‌!

Some research suggests that we need a breakfast to have weight - Sakshi

రోజులో అతిముఖ్యమైన ఆహారం ఉదయాన్నే తీసుకునే ఉపాహారమని చెబుతూంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇదేమంత మంచి సూత్రం కాదంటున్నారు మొనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఉపాహారం తినకపోతే ఆ తరువాత ఆకలి ఎక్కువై అవసరానికి మించి తింటారన్న గత అంచనాల్లో ఏమాత్రం నిజం లేదు.

అలాగే ఆరోగ్యకరమైన బరువు ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్‌ అవసరమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయని.. తాము జరిపిన తాజా అధ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే జరిగిన 13 అధ్యయనాల వివరాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. వీటికి అదనంగా తాము అమెరికా, యూకేలకు చెందిన కొంతమందిపై కొన్ని పరిశోధనలు చేశామని బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోని వారు మిగిలిన వారితో పోలిస్తే తేలికగా ఉన్నట్లు తెలిసింది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top