కోమలం మృదుత్వం | Softness komalam | Sakshi
Sakshi News home page

కోమలం మృదుత్వం

May 16 2015 11:42 PM | Updated on Sep 3 2017 2:10 AM

కోమలం  మృదుత్వం

కోమలం మృదుత్వం

నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం ...

 బ్యూటిప్స్

నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగా అలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి.

గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.
 

 
 

Advertisement
 
Advertisement
Advertisement