breaking news
Beautytips
-
కురులు... వివరాల విరులు..
అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తలవెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపంవల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తలవెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి.వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది. వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది. (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన -
కోమలం మృదుత్వం
బ్యూటిప్స్ నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగా అలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.