చిన్న వ్యాయామం.. రోజుల ప్రయోజనం..

Small exercise days purpose - Sakshi

వ్యాయామంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనం చాలాకాలంగా వింటున్నాం. కానీ ఎంత వ్యాయామానికి ఎంత? ఎలాంటి ప్రయోజనం జరుగుతుందన్నది మాత్రం సౌత్‌వెస్ట్‌ర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధన ద్వారా లెక్కకట్టారు. దీని ప్రకారం కేవలం ఒక్కసారి వ్యాయామం చేసినా జీవక్రియలపై దాని ప్రయోజనం కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే మెదడులోని న్యూరాన్లను ప్రభావితం చేయడం ద్వారా ఒక్క వ్యాయామం రెండు రోజుల పాటు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయని అంటున్నారు కెవిన్‌ విలియమ్స్‌ అనే శాస్త్రవేత్త. 

ఎలుకలపై ప్రయోగాలు చేయడం ద్వారా తాము వ్యాయామం చేసిననప్పుడు పీఎంఓసీ, ఏజీఆర్‌పీ అనే రెండు న్యూరాన్లు ఎక్కువ విడుదలవుతున్నట్లు ఇవి రెండూ కలిసి మెలనోకార్టిన్స్‌ అనే రసాయనాలను విడుదల చేస్తున్నట్లు స్పష్టమైందని కెవిన్‌ చెప్పారు. ఈ మెలనోకార్టిన్స్‌ మనం ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తూంటుందని చెప్పారు. అరవై నిమిషాలపాటు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తే పీఎంఓసీ న్యూరాన్‌  కారణంగా ఆకలి మందగించినట్లు తాము గుర్తించామని, అదేసమయంలో రక్తంలో చక్కెర మోతాదులు కూడా తగ్గాయని కెవిన్‌ వివరించారు. దీన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారైన ఓ మోస్తరు తీవ్రతతో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలుస్తున్నట్లు చెప్పారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top