నూరు నుంచి ఆరుకు తెచ్చారు! | Sakshi
Sakshi News home page

నూరు నుంచి ఆరుకు తెచ్చారు!

Published Wed, Nov 16 2016 10:52 PM

నూరు నుంచి   ఆరుకు తెచ్చారు!

స్టార్ ట్రైనర్

ఆరేళ్ల క్రితం నా తొలి మూవీ విడుదలైంది. మంచి పేరొచ్చింది కానీఆఫర్స్ రాలేదు. ఆ సమయంలో భుక్తి కోసం ఏ పని దొరికితే ఆ పని చేశాను. సరైన ఫుడ్ తినలేక, జిమ్‌కి వెళ్లలేక, సరైన పని లేకపోవడంతో రెండు మూడేళ్లలో బాగా వెయిట్ పెరిగాను. దాదాపుగా 100 కిలోల బరువుకి చేరుకున్నా. అదే సమయంలో ‘మాయ’ సినిమా ఛాన్సొచ్చింది. అందులో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రావడం నా ఎంట్రీ షాట్. ఆ షాట్‌లో లావుగా ఉంటే బాగుండదని డెరైక్టర్ నీలకంఠ అన్నారు. స్లిమ్‌గా మారమని ఓ రకంగా అల్టిమేటమ్ ఇచ్చారాయన. అలా నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫస్ట్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత హీరో రానాకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఆ టైమ్‌లో రానా నాకు ఎక్విప్‌మెంట్ ఇచ్చాడు, డైట్ చెప్పాడు. అంతేకాదు... తన పర్సనల్ ట్రైనర్ కునాల్‌ని పరిచయం చేశారు. అలా రానా నాకు చాలా హెల్ప్ చేశారు.

హిందీ సినిమాతో...
‘మాయ’ సినిమా నుంచి నా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2015లో బాలీవుడ్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ ఛాన్స్ వచ్చింది. అప్పుడు హీరో జాన్ అబ్రహాంను కలిస్తే... తన ట్రైనర్ వినోద్ చన్నాను పరిచయం చేశారు. నిజానికి వినోద్ చన్నా రెమ్యూనరేషన్ నా తాహతుకు మించిందే. అయినా... రెండు నెలల కోసం జాయినయ్యాను. ఆ తర్వాత నా ప్రొడక్షన్ హౌజ్, ప్రొడ్యూసర్ నాకు సాయం చేశారు.

చాలా పెద్ద స్టార్ ట్రైనర్ అయినప్పటికీ వినోద్ చాలా సింపుల్ పర్సన్.  ఫిట్‌నెస్ విషయంలో అత్యున్నత పరిజ్ఞానం ఉంది ఆయనకు. చాలా డిఫరెంట్ వర్కవుట్స్ చేయించేవాడు. టైగర్ వాక్, గొరిల్లా వాక్, క్రాబ్ వాక్... వంటివి భాగంగా ఉండే యానిమల్ ఫ్లో ఆయన చేయించే వెరైటీ వర్కవుట్స్‌కి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అలా ప్రతి రోజూ కనీసం ఒక్కటైనా కొత్త వర్కవుట్ చేయించడం వల్ల ఫిజిక్‌కి ఓ రకంగా షాక్ ఇచ్చినట్టు అయేది. దాంతో మన శరీరానికి వ్యాయామం అలవాటైపోయి, అది సులభం అయిపోవడం ఉండేది కాదు. వెజిటబుల్స్, చికెన్, ఎగ్‌వైట్స్, పెరుగు, ఆల్మండ్స్, వాల్‌నట్స్ వంటివి డైట్. వర్కవుట్ అయ్యాక మాత్రం ఒక ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. రోజుకు గంటన్నర పాటు చేసిన అలాంటి వర్కవుట్స్‌తో 6 నెలల్లో సిక్స్‌ప్యాక్ వచ్చింది. నూరు కిలోల నుంచి ‘ఆరు’ పలకల దేహానికి వచ్చానంటే ట్రైనర్ చలవే. ఇంకా ముందే వచ్చేదేమో కానీ, షార్ట్ కట్‌లో వెళ్లాలనుకోలేదు.

ఖరీదైనా... ఆయనే మిన్న...
ఇప్పటికీ ట్రైనర్‌గా వినోద్‌నే ప్రిఫర్ చేస్తున్నా. ఆయన చాలా ఎక్స్‌పెన్సివ్ అయినా... ఇకపై కూడా మానను. మన లోపల ఏం జరుగుతుంది అనేది ఆయన సరిగ్గా అంచనా వేయగలడు. టోటల్ బాడీని ఆయన స్క్రూటీనీ చేస్తాడు. ఆయన వల్ల నేను మరింత డిసిప్లిన్‌గా మారాను. ప్రస్తుతం నా బరువు 81 కిలోలు.   - హర్షవర్ధన్ రాణే

Advertisement
 
Advertisement
 
Advertisement