తెలివైన మగాడిని ఎలా గుర్తు పట్టాలంటే.... | remember how brilliant man . | Sakshi
Sakshi News home page

తెలివైన మగాడిని ఎలా గుర్తు పట్టాలంటే....

Apr 16 2014 12:37 AM | Updated on Sep 2 2017 6:04 AM

తెలివైన మగాడిని ఎలా గుర్తు పట్టాలంటే....

తెలివైన మగాడిని ఎలా గుర్తు పట్టాలంటే....

కేవలం ముఖకవళికల ఆధారంగానే ఒక అంచనాకు రాలేదు. అనేక అంశాలను కాచి వడబోసి ఒక నిర్ణయానికి వచ్చాం’’ అంటున్నారు పరిశోధకులు.

ఆసక్తికరం
 ఒక మగాడిని చూసీచూడగానే-


 ‘‘ఈయన తెలివైన వాడు’’ ‘‘ఈయన తెలివితక్కువవాడు’’ అని చెప్పగలమా?
 ‘‘అబ్బే..అదెలా సాధ్యం?’’ అంటాం.
  ‘‘ఖచ్చితంగా సాధ్యమే’’ అంటున్నారు చెక్ రిపబ్లిక్‌కు చెందిన పరిశోధకులు.

40 మంది పురుషులు, 40 మంది స్త్రీల ముఖారవిందాల ఫోటోలు తీసుకొని తెలివి తేటలు, ప్రవర్తనతో సహా రకరకాల విషయాలను అధ్యయనం చేశారు.

 ‘‘కేవలం ముఖకవళికల ఆధారంగానే ఒక అంచనాకు రాలేదు. అనేక అంశాలను కాచి వడబోసి ఒక నిర్ణయానికి వచ్చాం’’ అంటున్నారు పరిశోధకులు.

 వాళ్లు చెప్పిన విషయాల్లో మచ్చుకు కొన్ని

 పొడవైన ముక్కు, రెండు కళ్ల మధ్య బాగా దూరం ఉన్నవాళ్లకు ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి.
 గుండ్రటి చుబుకం ఉన్నవాళ్లలో తెలివివైనవాళ్లు ఎక్కువగా ఉంటారు.
 గుండ్రటి ముఖం, ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్న కళ్లు ఉన్నవాళ్లకు తక్కువ తెలివితేటలు ఉంటాయట!
 
 

Advertisement
 
Advertisement
Advertisement