ఆ ప్రొటీన్‌తో వందేళ్లు, ఆరోగ్యం కూడా!

protein is a hundred years old and healthy - Sakshi

పరి పరిశోధన 

వందేళ్లు బతకాలని అందరూ కోరుకుంటారుగానీ.. ముసలి వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తుకొస్తే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకేనేమో.. బ్రౌన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆయుష్షును పెంచడం కాకుండా, బతికున్నంత కాలమూ ఆరోగ్యం ఉండటం ఎలా? అన్న అంశంపై దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఈగలపై కొన్ని ప్రయోగాలు చేస్తే.. సిర్ట్‌4 అనే ప్రొటీన్‌తో ఇది సాధ్యమని తెలిసింది. ఈ ప్రొటీన్‌ అటు జీవక్రియలతోపాటు.. వయసుతోపాటు వచ్చే వ్యాధుల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో సిర్ట్‌4 ప్రొటీన్‌ను ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈగలపై పరిశోధనలు జరిగాయన్నమాట.

సిర్ట్‌4 ప్రొటీన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఈగల ఆయుష్షు 20 శాతం ఎక్కువ కావడంతోపాటు ఆరోగ్యంగానూ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన ఈగలను పరిశీలిస్తే ఆయుష్షు 20 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉపవాసమున్నప్పుడు సిర్ట్‌4 ప్రొటీన్‌ కణాలకు అవసరమైన ఇంధనాన్ని అందిస్తూందని.. ఈ ప్రొటీన్‌ తక్కువ ఉన్న ఈగలు సాధారణ ఈగల కంటే వేగంగా చచ్చిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్‌ హెల్‌ఫాండ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top