నన్నడగొద్దు ప్లీజ్‌

Priyadarshini Ram love doctor - Sakshi

హాయ్‌ సార్‌...! నేను ఐదేళ్లుగా ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. తనూ నన్ను లవ్‌ చేసింది. తను ఆపరేషన్‌ థియేటర్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు నా దగ్గరకు వచ్చి తనతో పాటు పనిచేస్తున్న ఒకడు తనను బలవంతం చేశాడని బాగా ఏడ్చింది. నీ తప్పులేకుండా జరిగింది కదా అని నచ్చజెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లి చాలా కేరింగ్‌గా చూసుకున్నాను. కొన్ని రోజుల తరువాత తన ఫోన్‌లో వాడితో చేసిన చాట్‌ చూసి చాలా షాక్‌ అయ్యాను. మెసేజ్‌లన్నీ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. తనని చాలా పిచ్చిగా నమ్మాను సార్, తనకోసం చాలా చేశాను. అయినా నా బాధంతా నన్ను మోసం చేసినందుకు కాదు, వాడు మంచివాడు కాదు సార్‌. ఎక్కడ తన జీవితం నాశనం చేసుకుంటుందోనని భయంగా ఉంది. నిజానికి తను చేసిన ఈ మోసానికి చనిపోవాలనుకున్నా. కానీ మా ఫ్యామిలీ చాలా పూర్‌ సార్‌. చాలా కష్టపడి నన్ను చదివించారు. నేను లేకపోతే వాళ్లంతా ఏమైపోతారోనని ఆలోచించి ఆగిపోయాను. ఇప్పటికీ తను చేసిన మోసం గుర్తుకొస్తుంటే ప్రాణం పోయినట్లనిపిస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. ఏదైనా మంచి సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌. – చంద్ర

మనసును గుప్పెట్లో పెట్టుకున్నవాడు... ‘అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకున్నాననుకున్నాడు సార్‌...!’ నువ్వు ఆగుతావా నీలాంబరీ...??‘ఎందుకు ఆగాలి సార్‌ చంద్ర లైఫ్‌లో ద్రోహం జరిగింది. మీరు ఇప్పుడు కూడా అమ్మాయిది తప్పుకాదని అంటే... కృంగిపోతాడు సార్‌... అయినా ఇదేం చోద్యం సార్‌..?  అక్కడ చంద్ర ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ప్రేమలో తన్నుకులాడుతుంటే... మీరు మనసు గుప్పెట్లో పెట్టుకోమని... పెంట అడ్వైజ్‌లు ఎలా ఇస్తారు సార్‌???’ హలో.. కొంచెం స్లో..! ఎక్కువైంది ఫ్లో....!! ‘ఏంటి సార్‌ ఎక్కువైంది..?? చంద్రకి సరైన ఆన్సర్‌ ఇవ్వకుండా వెటకారాలు, ఛీత్కారాలు లాంటివి నేను ఒప్పుకోను...’ చంద్రా సారీ..! నీకు ఇలా జరగాల్సింది కాదు.

ఎంతగా ప్రేమించావు... ఎంతగా అభిమానించావు... తప్పు జరిగినా ఎంతగా ప్రేమిస్తున్నావు..? యు ఆర్‌ గ్రేట్‌ చంద్ర. ఒక అమ్మాయిని ప్రేమించిన దాంట్లో 10%... నీ ఫ్యామిలీని ప్రేమిస్తే... నీ బాధ మాయమైపోతుంది. నీకు ఒక కొత్తదనం అనిపిస్తుంది... మనసు చాలా లైట్‌గా... హ్యాపీగా అనిపిస్తుంది. ప్రేమించడానికి కాదు చంద్ర... ప్రేమించబడడానికి కూడా అర్హత ఉండాలి. ఆ అమ్మాయికి నీ ప్రేమ పొందే అర్హత లేదు.నీ ఫ్యామిలీకి నీ ప్రేమను మించిన ఆనందం లేదు. లవ్‌ లైఫ్‌. లవ్‌ ఫ్యామిలీ... లవ్‌ యువర్‌ సెల్ఫ్‌... తప్పకుండా నీ ప్రేమకు అర్హురాలైన అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.’ ‘కరెక్ట్‌ ఆన్సర్‌ ఇచ్చారు కాబట్టి మీకు అరటిపండు తినే అర్హత ఉంది సార్‌!’

- ప్రియదర్శిని రామ్‌ ,లవ్‌ డాక్టర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top