ప్లెయిన్ పోజ్

ప్లెయిన్ పోజ్


పైనొక ప్లెయిన్ కుర్తీ...

కిందొక ప్లెయిన్ పలాజో...

ఇగ జూస్కో పోజు!

ఎంత ప్లెయిన్ అయినా నథింగ్ సో సో...

ప్లెయిన్ విత్ పలాజో!!


స్లీవ్‌లెస్ షార్ట్ ప్లెయిన్ కుర్తీకి బాటమ్‌గా కాంట్రాస్ట్  పలాజో ధరిస్తే కంఫర్ట్ ఫీల్‌నిస్తుంది. అంతేకాదు, సూపర్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటారు.


రెడ్ అండ్ వైట్ ప్లెయిన్ కాంబినేషన్. వెస్ట్రన్‌పార్టీలో వెరైటీ లుక్.


నలుపు రంగు లాంగ్ స్లీవ్స్ కుర్తీ, ముదురు ఎరుపు పలాజో నేటి వనితలకు నప్పే సరైన డిజైనర్ వేర్.


మిడ్ స్లీవ్స్ షార్ట్ కుర్తీకి కాటన్ పలాజో హుందాతనాన్ని పెంచుతుంది. ట్రెడిషనల్ లుక్‌తోనే మోడ్రన్‌గా ఆకట్టుకోవాలనుకునే వారికి సరైన ఎంపిక. 


లాంగ్ గ్రే కలర్ కుర్తాకి నలుపురంగు పలాజో క్యాజువల్ అండ్ కంఫర్ట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంది.


షర్ట్ టైప్ ప్లెయిన్ లాంగ్ కుర్తీకి వైట్ పలాజో సింపుల్‌గా అనిపించే గ్రేట్ కాంబినేషన్. క్యాజువల్ వేర్‌లో అతివలను అమితంగా ఆకట్టుకుంటున్న స్టైల్ ఇది.


మస్టర్డ్ ఎల్లో లాంగ్ స్లీవ్‌లెస్ కుర్తీ టాప్, రాణీ పింక్ పలాజో సంప్రదాయ వేడుకలకు స్టైలిష్ మెరుగులు అద్దుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top