
నవంబర్ 19న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2.
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
జీనత్ అమన్ (నటి), సుస్మితాసేన్ (మాజీ విశ్వసుందరి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత ఏడాది మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వీరు పుట్టిన తేదీ 19.
ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ; నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. నవంబర్ నెలలో జన్మించడం వల్ల మీలో గాంభీర్యం, నాయకత్వ లక్షణాలతోపాటు ఆత్మవిశ్వాసంతో కష్టపడి ధనం సంపాదిస్తారు. లక్కీ నంబర్స్: 1,2, 5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, వైట్ శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, ఆది, సోమవారాలు; సూచనలు: సూర్యాష్టకం పఠించడ, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వృద్ధులకు పాయసం తినిపించడం, వె న్నెలలో విహరించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్