జూన్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: | On June 11, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూన్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:

Jun 10 2015 10:34 PM | Updated on Sep 3 2017 3:31 AM

జూన్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:

జూన్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. వీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికోన్నతితోపాటు ప్రాపంచిక

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
లాలుప్రసాద్ యాదవ్ (రాజకీయవేత్త)
సత్యన్ శివకుమార్ (నటుడు)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. వీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికోన్నతితోపాటు ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. పుట్టిన తేదీలో రెండు ఒకట్లు ఉండటం వల్ల గొప్ప నాయకుడిగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. సంఘంలో విశేష పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించడంతోపాటు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పూర్తి ఆధ్యాత్మికతో ఉండటం వల్ల సంసార జీవనానికి దూరమయే అవకాశం ఉంది కాబట్టి ఆధ్యాత్మికతతో పాటు ప్రాపంచిక విషయాల పట్ల కూడా ఆసక్తి చూపితే బాగుంటుంది. గురువులకు, వేదపండితులకు, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి.

 లక్కీనంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రే, క్రీమ్, ఎల్లో. లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు.సూచనలు: గురువులును, పండితులను, పెద్దలను గౌరవించడం, దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆరాధించటం, వృద్ధాశ్రమాలలో అన్నదానం చేయడం.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 
 

Advertisement
 
Advertisement
Advertisement