అంధుల కోసం స్పెషల్ మెనూ! | Om Restaurant in bangalore introduce brailey menu card | Sakshi
Sakshi News home page

అంధుల కోసం స్పెషల్ మెనూ!

Sep 25 2013 11:48 PM | Updated on Sep 1 2017 11:02 PM

అంధుల కోసం స్పెషల్ మెనూ!

అంధుల కోసం స్పెషల్ మెనూ!

‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.

‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ‘ఓమ్’ అనే రెస్టారెంట్ అంధుల కోసం ప్రత్యేకంగా మెనూ కార్డ్‌ను తయారుచేసింది. రుచిగా, శుచిగా ఆహారాన్ని అందిస్తుందనే పేరున్న ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ మెనూకార్డ్‌ను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసి అందుబాటులో ఉంచింది.

దీర్ఘ దృష్టి సమస్య ఉన్న వారి కోసం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండే ఈ మెనూ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వారు అంధులకు ఈ సౌకర్యం తీసుకురావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఓమ్ రెస్టారెంట్‌కు పక్కగా ఒక ఎన్జీవో ఆఫీస్ ఉంటుంది. విజువల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ కోసం పనిచేసే ఆ సంస్థ కార్యాలయానికి చాలామంది అంధులు వస్తుంటారు.

పని మీద ఆ ఎన్జీవో ఆఫీస్‌కు వచ్చి, తినడానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్ ఓనర్లు ఈ అవకాశాన్ని కల్పించారు. తమకు కావలసిన ఆహారం గురించి చదువుకొని.. ఆర్డర్ చేసేంత కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది రెస్టారెంట్. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ మెనూ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తాము చేసిన పనికి ప్రచారం వస్తోందని, అనేక మంది రెస్టారెంట్ ఓనర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఓమ్ రెస్టారెంట్ ఓనర్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement