డ్యూయెట్‌!

Now trend is kurta  - Sakshi

పొడవు కుర్తీ, పొట్టి గౌన్‌ అది మన సంప్రదాయ డిజైన్‌ అయినా, పాశ్చాత్య స్టైల్‌ అయినా  ఒకటే డ్రెస్‌కు రెండు ప్యాటర్న్‌ రంగులు. డిజైన్లలో హంగులు ఉంటే ఇలా మనసు దోచేస్తాయి. చిన్న మార్పుతో డ్రెస్‌కి ఆకట్టుకునే లుక్‌ తీసుకురావచ్చు.

ముదురు, లేత రంగుల కాంబినేషన్‌తోనూ డ్రెస్‌ లుక్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. మరే హంగులూ లేకున్నా ఇలాంటి డ్రెస్‌ ధరిస్తే ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ప్రత్యేకతే ఇప్పడు ట్రెండ్‌ అయ్యింది. వచ్చేది వానకాలం. మబ్బులు పట్టి కాస్త డల్‌గా ఉన్న వాతావరణాన్ని   కొంత చమక్కుమనిపించే స్టైల్‌తో మేల్కొలిపితే మనసు కూడా హుషారైపోతుంది.

ఫ్యాషన్‌ పోయెట్‌ రాసిన డ్యూయెట్‌ ఇది. బారున రెండు రంగులు కుట్టేస్తే అరుణాన్ని పున్నమితో కలిపినట్టు లేదూ! నేలను ముద్దాడే సముద్రంలా లేదూ! ఇవి రెండు వర్ణాలు కావు వర్ణించలేనంత అందమైన ద్వివర్ణాలు


(నిలువు, అడ్డ చారల డిజైన్‌లో కుర్తీ ,జీన్స్‌పైన టు ప్యాటర్న్‌ స్టైల్‌ స్లిట్‌ టాప్‌ , కుడివైపు ఫ్లోరల్, ఎడమ వైపు ప్లెయిన్‌.. లాంగ్‌టాప్‌ ,ఓ వైపు ప్రింట్లు, మరో వైపు నీలం రంగు లాంగ్‌ గౌన్‌ )


(
పువ్వుల ప్రింట్లలోనూ రంగుల వైవిధ్యం ,ద్వివర్ణాల లాంగ్‌ కుర్తా! )

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top