నీతా చేతి గోరింటాకు! | Mehendi designing | Sakshi
Sakshi News home page

నీతా చేతి గోరింటాకు!

Apr 29 2014 10:51 PM | Updated on Sep 2 2017 6:42 AM

నీతా చేతి గోరింటాకు!

నీతా చేతి గోరింటాకు!

గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం మాత్రమే కాదు కళ కూడా. మెహెందీ పేరుచెప్పగానే ఏ మహిళైనా వెంటనే చేయి చాపుతుంది. ఆసక్తిని కాస్తా ఆర్ట్‌గా మార్చుకున్న నీతా దేశాయ్ శర్మ మనదేశంలో టాప్‌టెన్ మెహందీ డిజైనర్లలో ఒకరు.

 కళ

 గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం మాత్రమే కాదు కళ కూడా. మెహెందీ పేరుచెప్పగానే ఏ మహిళైనా వెంటనే చేయి చాపుతుంది. ఆసక్తిని కాస్తా ఆర్ట్‌గా మార్చుకున్న నీతా దేశాయ్ శర్మ మనదేశంలో టాప్‌టెన్ మెహందీ డిజైనర్లలో ఒకరు. సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్న నీతా దేశాయ్ పుణెలో జన్మించారు. సేవాకార్యక్రమాల్లో భాగంగా...విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో నీతా మెహెందీ కళపై దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి మెహందీని ఇష్టపడే నీతాకు అప్పటికే బోలెడు డిజైన్లు వచ్చు. ఇండియన్, పాకిస్తాన్, అరబ్ మెహందీ డిజైన్లపై ప్రత్యేకంగా చేసిన సాధన నీతాలోని ఓ కళాకారిణిని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది.

మెహందీ డిజైన్లపై నీతా చేసిన ప్రయోగాలన్నింటికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న నీతా విదేశీ పర్యటనలో భాగంగా ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, యూరప్‌లలో తన మెహెందీ డిజైన్లను పరిచయం చేసింది. ఆమె కనుగొన్న కొత్తడిజైన్లకు సంబంధించి రెండు పుస్తకాలు కూడా వేసింది.  ఇక ఇండియన్ డిజైన్ల విషయానికొస్తే ఎడమ చేతిపై పెళ్లికూతురు ముఖాన్ని, కుడి చేతిపై పెళ్లికొడుకు ముఖాన్ని కోన్‌తో వేయడం నీతా ప్రత్యేకతన్నమాట. మెహెందీ కళలో మేమంటే మేము...అంటూ పోటీపడేవాళ్లలో నీతా ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారంటూ కితాబిచ్చారు వరల్డ్ ఫ్యాషన్ మ్యాగజైన్‌వారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement