నన్నడగొద్దు ప్లీజ్‌ 

Love doctor returns to answers - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నా వంక చూసేది. అలా రోజూ గమనించాను. ఓ రోజు ధైర్యం చేసి తన ఫ్రెండ్‌ సహాయంతో తనకి లవ్‌ లెటర్‌ ఇప్పించాను. తను ఆ లెటర్‌ని మా అమ్మకు చూపించి, నన్ను తిట్టించింది. ఆ తర్వాత నుంచి తను నా వైపు కోపంగా చూస్తోంది. నన్ను చూడటం మాత్రం మానలేదు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఒకసారి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. అసలు నా గురించి తను ఏం అనుకుంటోందో అర్థం కావట్లేదు. తనని ఫస్ట్‌ టైమ్‌ ఒక జాతరలో చూశాను. అప్పుడు ఆ అమ్మాయి ఒకసారి నా వంక, మరోసారి పక్కకు ఫేస్‌ తిప్పింది. అసలు తన మనసు ఏంటో తెలియట్లేదు. నాకైతే వాళ్ల అమ్మని ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగెయ్యాలని ఉంది . కానీ నాకు ఇంకా జాబ్‌ లేదు. జాబ్‌ లేకుండా అడిగితే ఏమని అడగాలి అన్నయ్యా, చెప్పండి ప్లీజ్‌! – కుమార్‌
అడుక్కో అన్నయ్యా..! అడుక్కో....!మనసారా అడుక్కో...!తనివితీరా అడుక్కో....!తడబడకుండా అడుక్కో....!వెనుకంజ వేయకుండా అడుక్కో....!నాన్‌స్టాప్‌గా అడుక్కో....!‘ఏమనుకున్నారు.. తన్నేమనుకున్నారు.. పిచ్చివాడనుకున్నారా.. ప్రేమ బిచ్చగాడనుకున్నారా.. ఏమనుకున్నారు..????????? ఏంటి సార్‌..!? బిచ్చగాడికి చెప్పినట్లు చెబుతున్నారు అడుక్కో...!అడుక్కో....!! అని. ఏంటి సార్‌..!? ఒక సిన్సియర్‌ ప్రేమికుడిని మీరు అంత చీప్‌గా చూస్తున్నారు..????’లవ్వాడినప్పుడు లేని సిగ్గు.. లవ్వు అడుక్కునేటప్పుడు ఎందుకు...?? ఛీ – పో అన్నప్పుడు లేని సిగ్గు.. తనే కావాలని అనుకున్నప్పుడు ఎందుకు?? ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి గిళ్లి అనుకున్నప్పుడు లేని సిగ్గు.. కాబోయే అత్తగారిని అడుక్కునేటప్పుడు ఎందుకు??? ఏమో అత్తగారికి నచ్చితే.. పెళ్లి చేసి, ఇల్లరికం ఉంచుకుని, రాజాలాగ చూసుకుంటారేమో..!?! మనమెందుకు అడ్డం చెప్పడం నీలూ????‘సార్‌!! పెళ్లీ అడుక్కుని.. ఇల్లరికమూ అడుక్కుని.. ఉద్యోగమూ అడుక్కుని.. అత్తగారి దగ్గర ఏం రెస్పెక్ట్‌ మిగులుతుంది సార్‌???’ఇవన్నీ అత్తని అడిగేముందు డిసైడ్‌ చేసుకోమను.. సొంత లెగ్స్‌ మీద స్టాండ్‌ అయ్యి పెళ్లికి అమ్మాయిని ఇవ్వమని అత్తగారిని డిమాండ్‌ చేసే పొజిషన్‌కి ముందు రమ్మను నీలూ!!
ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 
lovedoctorram@sakshi.com

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top