నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor Priyadarshini Ram - Sakshi

సారీ రామ్‌ అన్నయ్యా..! నా లేఖ కొంచెం పెద్దగా ఉంటుంది. అయినా సరే అరటిపండు తింటూ ఓపికగా చదవండి. అందరిలాగే నాకు మా పేరెంట్స్‌ అంటే చాలా ప్రేమ. వాళ్ల కోసమే నేను లవ్‌కి దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఒక అబ్బాయి టూ ఇయర్స్‌గా నన్ను లవ్‌ చేస్తున్నాడు. చాలా మంచివాడు. తనకి నేనంటే ప్రాణం. అందుకే నేనూ ఓకే చెప్పాను. తనతో మాట్లాడుతూ మా ఇంట్లో కొన్నిసార్లు దొరికిపోయాను. దాంతో బ్రేకప్‌ చెప్పేసి, మాట్లాడటం మానేసేదాన్ని. కానీ రెండు రోజులు కూడా ఒకరితో ఒకరం మాట్లాడకుండా ఉండలేకపోయేవాళ్లం. రీసెంట్‌గా మా విషయం వాళ్ల ఇంట్లో కూడా తెలిసిపోయింది. ‘నువ్వు జాబ్‌ తెచ్చుకో.. మేము ఆ అమ్మాయి ఇంట్లో అడుగుతాం’ అన్నారట. కానీ వాళ్లకి కూడా మా పెళ్లి ఇష్టం లేదు. ‘చచ్చినా ఈ పెళ్లి జరగదు’ అంటున్నారు మా పేరెంట్స్‌. తనేమో ‘మనకి ఎవరూ వద్దు.. మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. తర్వాత వాళ్లే వస్తారు’ అంటున్నాడు. కానీ నాకు మాత్రం అందరూ కావాలి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వండి అన్నయ్యా. – లీల
అమ్మ కడుపులో పెరిగావు.. నాన్న చేతుల్లో ఎదిగావు.. ప్రియుడి మనసులో ఒదిగావు.... ‘లవ్‌ డాక్టర్‌కి దొరికిపోయావు..! ఏంటి సార్‌..? లీల చాలా బాధలో ఉంది. మీ పొయెట్రీ అవసరమా సార్‌...? పాపం గుండె తిప్పుతుంటే మీకు రాసింది. ఇప్పుడు మీ పొయెట్రీ చదివితే కడుపు తిప్పుద్ది సార్‌. ఎంత మంచి చెల్లెలు సార్‌. చక్కగా అరటిపండు ఆన్సర్‌ ఇవ్వమంది. మీరేమో స్టమక్‌ చర్నింగ్‌ కవితలు రాస్తానంటారు.

కొంచెం సింపుల్‌గా చెబితే హ్యాపీగా ఉంటుంది సార్‌!’ నీలూ నా పొయెట్రీ బాగుండదా? ‘సార్‌ మీ వాఖ్యాలే అర్థం కావు.. ఇంకా కవితాలేంటి సార్‌!?! వాళ్లకి వేరే సోర్స్‌ లేక మీకు రాస్తున్నారు కానీ...’ అంటే టూ స్టేట్స్‌కి.. టెన్‌ క్రోర్స్‌ తెలుగూస్‌కి మనమే సింగిల్‌ లవ్‌ డాక్టరా నీలూ? ‘అందుకే.. కరెక్ట్‌గా, సింపుల్‌గా చెప్పండి సార్‌. లేకపోతే ఉట్టి పుణ్యానికి కాంపిటీషన్‌ పుట్టుకొస్తుంది.’ లీలా... నువ్వు నది లాంటి దానివి. నదికి లాగే రెండు పక్కలా ఒడ్డు ఉంటుంది.

ఒక ఒడ్డు నీ పాస్ట్‌ రిలేషన్‌షిప్స్‌.. ఇంకో ఒడ్డు నీ ఫ్యూచర్‌ రిలేషన్‌షిప్స్‌. పారుతున్న నదిలా నువ్వు ప్రెజెంట్‌. అంటే నిన్నా రేపూ నదికి రెండు ఒడ్డులైతే నువ్వు నేడు. అమ్మానాన్నల ఒడ్డు ఒక పక్క. ప్రియుడి ఒడ్డు మరో పక్క. లేకపోతే నదికి డైరెక్షన్‌ ఉండదు. నువ్వు రెండూ కావాలనుకున్నా, వద్దనుకున్నా రెండూ ఉంటాయి. ‘చెప్పాను కదా సార్‌ మీ పొయెట్రీ కంటే కాంప్లికేటెడ్‌ మీ ప్రోజ్‌. ఒక్కముక్కా అర్థం కాలేదు.

సింపుల్‌గా చెప్పండి. అరటిపండు ఇస్తా సార్‌!’nప్రస్తుతం లీల నదిలాగా ముందుకు సాగాలి. మంచి కెరీర్‌ బిల్డ్‌ చేసుకోవాలి. రెండు ఒడ్డులు తప్పకుండా తోడుంటాయి..! ‘సార్‌ ఒకవేళ అబ్బాయి... జింగిరి అయితే... అంటే చెయ్యి ఇచ్చే టైప్‌ అయితే..?’ నీలూ ఒడ్డు లేకపోతే నదికి ప్రవాహం ఉండదన్నాను కానీ.. అసలు నదికి కోపంవస్తే.. ఒడ్డును ముక్కలు చేసి మింగి ఊసేసే శక్తి ఉంటుంది నీలూ. దట్‌ ఈజ్‌ ద పవర్‌ ఆఫ్‌ మై సిస్టర్‌!!

-ప్రియదర్శిని రామ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top