రారండోయ్‌

Literature Events In Andhra Pradesh And Telangana - Sakshi
  • నవంబర్‌ 8న ప్రారంభమైన కొలకలూరి ఇనాక్‌ ‘సాహితీ సప్తాహం’ నవంబర్‌ 14 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు శ్రీత్యాగరాయ గానసభలో జరుగుతోంది. త్యాగరాయ గానసభ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇనాక్‌ పుస్తకాలు– గుడి, పొలి, మనోళ్లో మా కథలు, చలన సూత్రం (కథా సంపుటాలు), రంధి (నవల), మిత్ర సమాసం (పరిశోధన), అంబేద్కరు జీవితం (జీవిత చరిత్ర), విశాల శూన్యం (కవిత్వం)– ఆవిష్కరణ కానున్నాయి. పొలి ఆయన నూరో పుస్తకం కావడం గమనార్హం.
  • దాసరి మోహన్‌ కవితా సంపుటి ‘దండెం’ ఆవిష్కరణ నవంబర్‌ 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలంగాణ చైతన్య సాహితి. 
  • నారంశెట్టి బాలసాహిత్య పురస్కారాలను డి.కె.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణలకు నవంబర్‌ 14న ఉదయం 9:30కు పార్వతీపురంలోని ఆర్‌సీఎం బాలికోన్నత పాఠశాలలో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథి: ఎల్‌.ఆర్‌.స్వామి. నిర్వహణ: నారంశెట్టి బాలసాహిత్య పీఠం.
  • జ్ఞానజ్యోతి పురస్కారాన్ని గబ్బిట దుర్గాప్రసాద్‌కు నవంబర్‌ 15న సాయంత్రం 6 గంటలకు టాగూర్‌ గ్రంథాలయం, విజయవాడలో ప్రదానం చేయనున్నారు. కవి సమ్మేళనం కూడా ఉంటుంది. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం.
  • డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య జయంతి, పట్టాభి అవార్డ్స్‌–2018 ప్రదానోత్సవ సభ నవంబర్‌ 23న టాగూర్‌ స్మారక గ్రంథాలయం, విజయవాడలో జరగనుంది. నిర్వహణ: డాక్టర్‌ పట్టాభి కళా పీఠము. ఇందులో మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారాన్ని సింహప్రసాద్‌కూ, ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారాన్ని సిరికి స్వామినాయుడుకూ ప్రదానం చేస్తారు. కాకినాడ శతకవి సమ్మేళన కవితల ‘కవితోత్సవం–2019’, ఎస్‌.వివేకానంద కథా సంపుటాలు ‘పప్పు ధప్పళం’, వాలు కుర్చీ పుస్తకాల ఆవిష్కరణ కూడా జరగనుంది. 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top