అజీర్తితో బాధపడుతున్నారా? | Indigestion - health tips | Sakshi
Sakshi News home page

అజీర్తితో బాధపడుతున్నారా?

Oct 23 2017 12:40 AM | Updated on Oct 23 2017 3:48 AM

Indigestion - health tips

అజీర్ణంతో బాధపడుతున్నవారు భోజనం తర్వాత అరకప్పు పైనాపిల్‌ జ్యూస్‌ తీసుకుంటే వుంచి ఫలితం ఉంటుంది.
 ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో ఒకస్పూను నివ్మురసం, రెండు స్పూన్లు తేనె, అల్లం ముక్కలు చిన్నవి వేసుకుని అన్నింటినీ మిక్స్‌ చేసుకుని ఆ మిశ్రవూన్ని అజీర్తిగా అనిపించినప్పుడు తాగాలి.
భోజనం చేసిన తర్వాత పొట్టమీద ఐస్‌బ్యాగ్‌తో వుసాజ్‌ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
నివ్మురసం అజీర్తిని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తికి కారణవుయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక కప్పు వేడినీటిలో కొంచెం నివ్మురసం కలుపుకుని తాగాలి.
బేకింగ్‌ సోడా, వుంచినీళ్ళు సవుపాళల్లో తీసుకుని గ్లాస్‌లో కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశవునం కలుగుతుంది.
ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. జీరా టీ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి.
తాజా కొత్తిమీర అకులతో జ్యూస్‌ చేసి దానిలో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి ఈ మిశ్రవూన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement