డబుల్‌ గ్లామర్‌

Indian Designer Manish Malhotra Has Garnered Acclaim For This Year Wedding Season - Sakshi

ఫ్యాషన్‌

రెండు భిన్నమైన రంగుల లెహంగా ఒకటి.. ఒకే రంగులో రెండు పొరల లెహంగా మరొకటి. ఒకేరకం ఫ్యాబ్రిక్‌ లెహంగా ఒకటి.. రాసిల్క్‌– నెటెడ్‌ రెండు రకాల మెటీరియల్‌తోడిజైన్‌ చేసిన లెహంగా మరొకటి.ఇలా దేనికది భిన్నంగా, మది దోచేలా ఆకట్టుకుంటున్నాయి ఈ టు లేయర్డ్‌ లెహంగాలు. ట్విన్‌ లేయర్డ్‌ లెహంగాలుగానూ పేరున్న ఇవి వేడుకల్లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్యాజువల్‌గానూ కలర్‌ఫుల్‌ అనిపిస్తున్నాయి. డబుల్‌ గ్లామర్‌ అని ప్రశంసలు  అందుకుంటున్నాయి.

ఇండియన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ యేడాది వెడ్డింగ్‌ సీజన్‌లో భాగంగా డబుల్‌ లేయర్డ్‌ లెహంగాలను డిజైన్‌ పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవడానికి గ్రాండ్‌ ఎంబ్రాయిడరీతో పాటు ట్విన్‌ లేయర్డ్‌ కూడా ప్రధాన కారణం’ అంటారు మనీష్‌ మల్హోత్రా.

కుచ్చుల లెహంగా గురించి మనకు తెలిసిందే. లెహంగా ఎన్ని కుచ్చులతో ఉంటే అంచు భాగం అంత ఫ్లెయర్‌తో ఆకట్టుకుంటుంది.  
►ఉత్తర భారతదేశంలో దాండియా వేడుకల్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రెండు పొరల లెహంగా. దీనికి డిజైనర్‌ టచ్‌ ఇచ్చి సౌతిండియా సైతం సరికొత్తగా ముస్తాబు చేసింది. వేడుకల్లో ప్రత్యేకంగా నిలిపింది.
►ఒక లెహంగా పార్ట్‌ని తక్కువ కొలత తీసుకొని, దాని అంచు వద్ద మరొక పొరగా కుచ్చుల భాగాన్ని జత చేస్తే ఈ అందమైన లెహంగా డిజైన్‌ వచ్చేస్తుంది.
►పై భాగం ప్లెయిన్‌ పట్టు మెటీరియల్‌ తీసుకుంటే, కుచ్చుల భాగం నెటెడ్‌తో జత చేస్తే ఇలా కొత్తగా కనువిందుచేస్తుంది.
►ఈ లెహంగాకి వెస్ట్రన్‌ స్టైల్‌ క్రాప్‌టాప్‌ ధరిస్తే ఇండో–వెస్ట్రన్‌ లుక్‌లో ఆకట్టుకుంటారు.
►లాంగ్‌ జాకెట్‌ ధరిస్తే ఒకలా, ఎంబ్రాయిడరీ ఛోలీ ధరిస్తే మరోలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తారు.
►కాటన్, సిల్క్, నెటెడ్‌.. ఇలా ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా ఈ డబుల్‌ లేయర్డ్‌ లెహంగాలను డిజైన్‌ చేసుకోవచ్చు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top