భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు దేశంలో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా. ఈ సీజన్‌లో సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తన నివేదికలో వెల్లడించింది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT).. తన పరిశోధన విభాగం సీఏఐటీ రీసెర్చ్ & ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (CRTDS) ద్వారా విడుదల చేసిన నివేదికలో.. పెళ్లిళ్ల సీజన్ భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు భారీ ఊరటను ఇవ్వనుంది. బంగారం, రత్నాలు, దుస్తులు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్, ట్రావెల్స్ & హాస్పిటాలిటీ, డెకరేషన్ మొదలైన రంగాల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం ఢిల్లీలో మాత్రమే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుందని అంచనా. గత సంవత్సరం ఇదే కాలంలో దేశంలో జరిగిన మొత్తం వివాహాల సంఖ్య సమానంగా ఉన్నప్పటికీ.. ఈసారి ఖర్చు మాత్రం గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం వస్తువులు, బంగారు ఆభరణాల ధరలు పెరగడమే అని CAIT సెక్రటరీ జనరల్ అండ్ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
గతంలో జరిగిన వివాహాలు & వ్యాపారం
➤2024: 48 లక్షల వివాహాలు, రూ. 5.9 లక్షల కోట్ల వ్యాపారం
➤2023: 38 లక్షల వివాహాలు, రూ. 4.74 లక్షల కోట్ల బిజినెస్
➤2022: 32 లక్షల వివాహాలు, రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం
ఇదీ చదవండి: తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్


