ఇంటిప్స్ | home tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Apr 5 2016 12:37 AM | Updated on Sep 3 2017 9:12 PM

ఇంటిప్స్

ఇంటిప్స్

స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి

స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ ముక్కను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్‌ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది.


పచ్చికొబ్బరిని త్వరగా బయటకు తీయడానికి ఆ చిప్పను పావుగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే కొబ్బరి ముక్కలు సులువుగా వస్తాయి. కూరగాయలు తరిగే చాకులు, కటింగ్‌బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది!  కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి! బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే సరి... క్రిములు పారిపోతాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement