బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

High Protein Chana-Chaat Is An Excellent Addition To Weight Loss Diet - Sakshi

కాలంతో పాటు మనిషి కూడా పరిగెత్తడంతో జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో పాటు, కంటి నిండ నిద్రకు దూరం అవుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపైన పడుతోంది. ఒత్తిడి కారణంగా అతిగా తినడం వల్ల కూడా అధిక బరువుకు దారి తీస్తోంది. ఈ రోజుల్లో చాలా మందిని కలవరపరుస్తున్న వాటిలో అధిక బరువు. అయితే అదనపు బరువు అనేది మనం రోజు తీసుకునే ఆహారం మీదే ముడిపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన నేటి సమాజం అధిక కొవ్వు పదార్థాలు ఉండే ఫాస్ట్‌ ఫుడ్‌లైన పిజ్జా, బర్గర్‌లకు బాగా అలవాటైపోయారు. ఆ తర్వాత సరైన వ్యాయమం లేకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోనే పని చేయడం కూడా బరువుకు కారణం అవుతోంది.  తీరా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిమ్‌ల్లో చెమటలు పట్టేలా వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం అనుకున్నంతగా కనిపించడం లేదని వాపోవడం చూస్తూనే ఉన్నాం.

అయితే మన దేశంలో ప్రాచీన కాలం నుంచే అందుబాటులో ఉన్న పప్పు ధాన్యాలు, చిక్కుళ్లలో ప్రొటీన్‌ పాళ్లు పుష్కలంగా ఉండి బరువు సమస్యను తగ్గించేందుకు దోహదపడుతాయన్నవిషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా చిక్కుళ్లలో చిక్‌పీస్(శనగలు)‌, బఠానీ, సోయాబీన్స్‌ వంటివి బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని సంవృద్ధిగా తీసుకుని వంటిపై ఉన్న బరువును తేలిగ్గా వదిలించుకోవచ్చు.

ప్రొటీన్‌ల రారాజు చిక్‌పీస్‌
చిక్కుళ్లలో ఒక రకమైన శనగల్లో(చిక్‌పీస్‌) ప్రొటీన్‌, ఫైబర్‌లు మెండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఇటీవలే అమెరికాకు చెందిన ఓ ఆహార,న్యూట్రిషన్‌ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉదాహరణకు ఉడకబెట్టిన 100గ్రాముల చిక్‌పీస్‌లో 9గ్రా ప్రొటీన్స్‌,8గ్రా ఫైబర్‌, 2.6గ్రా ఫ్యాట్‌, ఐరన్‌లు ఉంటాయని నివేదికలో తెలిపింది. రోజు ఆహారంలో చనాచాట్‌ను తీసుకుంటే వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌ కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించడంతో పాటు, బ్లడ్‌ లెవల్, షుగర్‌ పాళ్లను కంట్రోల్‌లో ఉంచేందుకు దోహదపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్కెట్‌కు వెళ్లి చిక్‌పీస్‌ను కొనుగోలు చేయండి, అధిక బరువును తగ్గించుకోండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top