పూలు చల్లిన హోలీ | heroines new fashion dresess | Sakshi
Sakshi News home page

పూలు చల్లిన హోలీ

Mar 9 2017 10:52 PM | Updated on Sep 5 2017 5:38 AM

కెమికల్‌ కలర్స్‌ ఔట్‌... నేచురల్‌ కలర్స్‌ ఇన్‌ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి.

కెమికల్‌ కలర్స్‌ ఔట్‌... నేచురల్‌ కలర్స్‌ ఇన్‌ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి. మరి, ఆ పూల అచ్చులతోనే రంగులు అద్దుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం పూలు చల్లిన హోలీలా ఉంటుంది.


ఫ్రాక్‌ అంతా పువ్వులు రంగులు అద్దుకోవడానికి ముట్టడి చేస్తే నడిచివచ్చే సౌందర్యం కళ్లను కట్టడి చేయాల్సిందే!
టాప్‌ టు బాటమ్‌ పువ్వుల నవ్వులు తోడైతే వెస్ట్రన్‌ పార్టీలో వెలుగుల రవ్వలు విరజిమ్మాల్సిందే.
రంగులన్నీ చేరి పువ్వులుగా మారి అవి ప్రింట్లుగా దర్శనమిస్తే పెరిగే వయసుకూ అడ్డుకట్టవేయాల్సిందే!
వనితను వైవిధ్యంగా చూపాల్సిందే!
అంతర్జాతీయ వేదికలైనా సరే పువ్వుల సింగారాలు దుస్తుల మీదకు చేరితే అందరి చూపులు అల్లుకుపోవాల్సిందే!
పువ్వులు, లతలు జత చేరి అల్లుకుపోయాయంటే అవి లాంగ్‌ గౌన్‌కు కొత్త వన్నెలద్దాల్సిందే. అందంగా రూపుకట్టాల్సిందే!
అమ్మాయి మేనిరంగుతో పోటీ పడాలని గులాబీల సోయగం ఫ్రాక్‌ మీద రూపు కడితే అవి నిలువెల్లా విరిజల్లులై మురిపించాల్సిందే!
మోదుగపూల సింగారం తెల్లని టాప్‌ మీదకు చేరితే వాటికి పోటీగా పూలన్నీ రంగులను కుమ్మరించాల్సిందే! అవి మేనికి వసంతాన్ని మోసుకురావాల్సిందే! 

Advertisement
 
Advertisement
Advertisement