ఆళ్లు మారిపోయారు బాసూ! | Girls are not changed, only the can expose their old feelings | Sakshi
Sakshi News home page

ఆళ్లు మారిపోయారు బాసూ!

Sep 30 2014 11:49 PM | Updated on Apr 4 2019 3:25 PM

ఆళ్లు మారిపోయారు బాసూ! - Sakshi

ఆళ్లు మారిపోయారు బాసూ!

కొంతకాలంగా అమ్మాయిలకు ముదుర్లు అనే ముద్ర వేస్తున్నారట మగాళ్లు. అయితే, ఇది అబద్ధం అంటున్నారు అమ్మాయిలు. మరి నిజమేంటో ఇద్దరూ ఓ నిర్ణయానికి రాలేకపోతుంటే అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ వీరికి మాట సాయం చేసింది. ఏంటో వినండి!

కొంతకాలంగా అమ్మాయిలకు ముదుర్లు అనే ముద్ర వేస్తున్నారట మగాళ్లు. అయితే, ఇది అబద్ధం అంటున్నారు అమ్మాయిలు. మరి నిజమేంటో ఇద్దరూ ఓ నిర్ణయానికి రాలేకపోతుంటే అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ వీరికి మాట సాయం చేసింది. ఏంటో వినండి!
 
అమ్మాయిలు ముదుర్లుగా ఏమీ మారిపోలేదు. గతంలో వారిలో గుట్టలు గుట్టలుగా  పోగుపడి ఉన్న అమాయకత్వాన్ని తొలగించుకున్నారట. ఈ విషయాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ ధ్రువీకరించింది. ఎందుకిలాంటి నిర్ణయానికి వచ్చిందో ఆ సంస్థ వివరించింది. ఇంతకుముందు శారీరక బలహీనత వల్ల స్త్రీ స్వేచ్ఛ కాస్త తక్కువగా ఉండేది. సమాజంలో భద్రత ప్రమాణాలు పెరిగాక, విద్యారంగంలో విజయాలు సాధిస్తున్న తరువాత తమకు ఉన్న ఆప్షన్లను  తెలుసుకోగలుగుతున్నారు.
 
ఆప్షన్లు ఉన్నపుడు వారికి ఎంపిక అవకాశం దక్కింది. దీంతో సెలెక్టివ్‌గా ఉండగలుగుతున్నారు అని ‘ప్యూ రిసెర్చి’ పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో పాతికేళ్లు నిండి పెళ్లి కాకుండా ఉండిపోతున్న వారి సంఖ్య మునుపటి సంవత్సరాలతో పోలిస్తే బాగా ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దీనికి కారణాలు అనేకం  ఉన్నాయి. వాటిలో మొదటిది కాస్త స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అక్కడ మనలాగా ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లేకున్నా... కాస్త భద్రత కలిగిన వృత్తిలో (ఉద్యోగం పోగొట్టుకున్నా వెంటనే మరో ఉద్యోగం తెచ్చుకోగలిగిన నైపుణ్యాలున్న వారు) ఉన్నవారిని ఎంచుకుంటున్నారు.78 శాతం అమ్మాయిలు ఇలాంటి వారిని కోరుకుంటున్నారు.
 
సంతానం గురించి తమ లాంటి ఆలోచన ఉన్న వారినే పెళ్లాడాలని  62 శాతం యువకులు కోరుకుంటుంటే, యువతులు 70 శాతం మంది కోరుకుంటున్నారు. అబ్బాయిల్లో నైతిక, ఆధ్మాత్యిక భావాలుండాలని కోరుకున్న యువతుల శాతం 38 శాతం ఉండటం గమనార్హం. ఇద్దరి అభిప్రాయాలు కలిసింది విద్యలోనే. బాగా చదువుకున్న వ్యక్తి భాగస్వామి కావాలని అబ్బాయిలు -అమ్మాయిలు ఒకే స్థాయిలో అంటే 28 శాతం మంది కోరుకుంటున్నారు. ఇదే పరిస్థితి మన దేశంలో గమనిస్తే ఇంకాస్త ఆసక్తికరంగా ఉంది. ఎంపిక అవకాశం పాశ్చాత్య దేశాల్లో ఐదు దశాబ్దాలుగా మెల్లగా వృద్ధి చెందగా, అక్కడ అయిదు దశాబ్దాల్లో కనిపించిన వృద్ధి ఇక్కడ రెండు దశాబ్దాల్లోనే కనిపించింది.
 
ఇటీవలి కాలంలో మన దేశంలో వధువుల కొరత ఉంది. నిజానికి ఇది కొరత కాదు, వారికి వరుడి లక్షణాలను ఎంచుకునే అవకాశం రావడంతో పెళ్లిళ్లు చేసుకునే వయసు పరిమితి మరింత పెరిగింది. దీనివల్ల అబ్బాయిల్లో ఆందోళన పెరిగింది. సాధారణంగానే ఇక్కడ ఇరువురికీ నాలుగైదేళ్లు వయసు తేడా ఉండేది.
 
ఇప్పుడు అది కూడా మెరుగుపడింది. రాష్ట్రాలను బట్టి వధువుల కొరత వెయ్యిమందికి 30-180 వరకు  ఉంటోంది. దీనివల్ల ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగంలో స్థిరపడిన అబ్బాయిలు, మంచి కుటుంబ వారసత్వం ఉన్న వారు, సామాజికంగా, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబాల వారికి అమ్మాయిల ఆమోదం లభిస్తోంది. నిజానికి ఇదేమీ స్వార్థం కాదు. ముందుచూపు మాత్రమే.
 
కాబట్టి... అబ్బాయిలు కూడా కాలేజీల్లో ఉండగానే కెరీర్ ప్లానింగ్‌తో పాటు, మ్యారేజ్ ప్లానింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉండే నిజం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement