విశ్వాసముంటే.. నాలుగేళ్ల అధికాయుష్షు! 

Faith is a four year old official! - Sakshi

దైవాన్ని, మతాన్ని నమ్మేవారు ఇతరుల కంటే నాలుగేళ్లు ఎక్కువ బతికేందుకు అవకాశముంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం జరిపి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని లారా వాలెస్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. సాధారణంగా మతాన్ని నమ్మిన వాళ్లు ధార్మిక కార్యక్రమాలు లేదంటే సామాజిక కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారని.. ఇలాంటి వారు ఇతరుల కంటే ఎక్కువ కాలం బతుకుతారని గతంలోనే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయని లారా అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాము మతాల వివరాలను సేకరించేందుకు సంస్మరణ సభలను ప్రాతిపదికగా తీసుకున్నామని, కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరణించిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా? వివాహమైందా? లేదా? అన్నవీ గమనించి పరిశీలించినప్పుడు మతాన్ని నమ్మినవారు దాదాపు 6.48 ఏళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశముందన్న అంచనాకు వచ్చామని వివరించారు. అమెరికాలోని మొత్తం 43 ప్రధాన నగరాల్లోని 1096 మందిపై జరిగిన రెండో అధ్యయనంలో ఇది 5.64 ఏళ్లుగా ఉన్నట్లు స్పష్టమైందని, మొత్తమ్మీద చూస్తే మతవిశ్వాసాలు కలిగి ఉండటం.. ధార్మిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం నాలుగేళ్ల ఆయుష్షునిస్తుందని తెలుస్తోందని లారా చెప్పారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top