ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే...
ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే... ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఈ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఇటువంటి వారికి కూడా చౌకగా విద్యుత్తు వెలుగులు పంచేందుకు ఎన్నో ప్రయత్నాలూ జరుగుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ సమస్య పరిష్కారానికి ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. మానవ మూత్రంతోనే చిన్న మోతాదులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఓ ఫ్యుయెల్ సెల్‌ను అభివృద్ధి చేసింది.
ఫ్యుయెల్ సెల్‌లోని సూక్ష్మజీవులు మూత్రాన్ని విడగొట్టి విద్యుత్తును నేరుగా ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో ఫ్యుయెల్‌సెల్‌ను తయారు చేసేందుకు డాలరు (రూ.63) కంటే ఎక్కువ ఖర్చు కాదని ఈ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లెరోపౌలస్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, అశాంతి చెలరేగుతున్న ప్రాంతాల్లో ఉన్న శరణార్థి శిబిరాల్లో విద్యుత్తు వెలుగులు పండించే లక్ష్యంతో తాము దీన్ని అభివృద్ధి చేశామని, ఒక్కో ఫ్యుయెల్ సెల్‌తో ఎల్‌ఈడీ బల్బులనూ వెలిగించవచ్చునని ఆయన వివరించారు.