విజయానికి అతి దగ్గర దారి...

విజయానికి అతి దగ్గర దారి... - Sakshi


మై ఫిలాసఫీ

 

విజయానికి దగ్గరి దారులు ఎన్నో ఉండవచ్చు. అతి దగ్గరి దారి మాత్రం... అంకితభావం, అమితంగా కష్టపడడం.

 

‘చాలా పోటీ ఉంది. ఇలాంటి ఎత్తులు వేస్తే మనం నిలదొక్కుకుంటాం’ అని కొందరు సలహాలు ఇస్తుంటారు. మనం నిలదొక్కుకోవడానికి కావల్సింది ‘పని’ తప్ప ‘ఎత్తుగడ’ కాదు. ఎత్తుగడల ద్వారా నిలదొక్కుకున్నా... ఆ పునాది బలహీనంగా ఉంటుంది.

 

రెండో ప్రయత్నం అనేది ఎప్పుడూ మంచిదే. చిన్నప్పుడు లెక్కల టీచర్ అనేవారు ‘‘ఒక్కసారి కాకుంటే వందసార్లు ప్రయత్నించు’’ అని! దీన్ని జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు.

      

ఓటమి బరువు... బాధ్యతను పెంచుతుంది. బాధ్యత విజయాన్ని ప్రేరేపిస్తుంది. విజయం మరిన్ని విజయాలకు చుక్కాని అవుతుంది. కష్టపడే తత్వాన్ని పెంపొందిస్తుంది.

      

భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిదే కానీ, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తే... వర్తమానంలో మనం చేసే పని దెబ్బతింటుంది.

      

ఫలితం గురించి దీర్ఘంగా ఆలోచించకుండా...నిర్ణయం గురించి లోతుగా ఆలోచిస్తాను. దీని వల్ల నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా అది సత్ఫలితాన్ని ఇస్తుంది.

      

ప్రొఫెషన్ డిమాండ్ చేసినట్లు మనం ఉండాలిగానీ, మనం డిమాండ్ చేసినట్లు ప్రొఫెషన్ ఉండదు. ఇది తెలుసుకుంటే ఏ వృత్తిలో అయినా మన ప్రయాణం సజావుగా సాగుతుంది.

      

క్షమించడం, మరచిపోవడం అనేవి నా వరకు అత్యున్నత లక్షణాలు. ఎవరో మనకు ఏదో అపకారం చేశారని కక్ష పెట్టుకుంటే మనసు పాడై పోతుంది. కాబట్టి క్షమించడమే కరెక్ట్. ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని తలుచుకొని కుమిలి పోతే కొత్తగా ఏమీ చేయలేం. కాబట్టి ఆ దుఃఖాన్ని మరిచిపోవడమే మంచిది.- జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హీరోయిన్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top