పసి పిల్లలు ఎందుకు నవ్వుతారు? | Children girlish scream? | Sakshi
Sakshi News home page

పసి పిల్లలు ఎందుకు నవ్వుతారు?

Mar 18 2014 12:05 AM | Updated on Sep 2 2017 4:49 AM

పసి పిల్లలు ఎందుకు నవ్వుతారు?

పసి పిల్లలు ఎందుకు నవ్వుతారు?

పిల్లలు ఎందుకు నవ్వుతారు?’ అని అడిగితే- ‘నవ్వొచ్చింది కాబట్టి’ అని జవాబు చెప్పడం తేలికేగానీ బ్రిటన్ పరిశోధకుడు డా.ఆడ్‌మన్ ఈ తేలికైన సమాధానంతో తృప్తి పడదలుచుకోలేదు.

అధ్యయనం
 
పిల్లలు ఎందుకు నవ్వుతారు?’ అని అడిగితే- ‘నవ్వొచ్చింది కాబట్టి’ అని జవాబు చెప్పడం తేలికేగానీ బ్రిటన్ పరిశోధకుడు డా.ఆడ్‌మన్ ఈ తేలికైన సమాధానంతో తృప్తి పడదలుచుకోలేదు. పసిపిల్లల నవ్వుల వెనక కారణాలను తెలుసుకోవడానికి నడుం కట్టాడు. దేశదేశాలు తిరిగి పరిశోధనలు చేశాడు. ఏ సమయంలో నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు?   

మొదలైన  వాటితో ఒక ప్రశ్నావళిని రూపొందించి తల్లిదండ్రుల ముందుంచి లోతైన అధ్యయనానికి పూనుకున్నాడు ఆడ్‌మన్.  నవ్వు, చిరునవ్వులు... అనేవి పిల్లలు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును ప్రతిఫలిస్తాయి అంటాడు ఆడ్‌మన్. మగ శిశువులతో పోల్చితే, ఆడ శిశువులు తక్కువగా నవ్వుతారట. మగ శిశువులు రోజులో 50సార్లు నవ్వితే, ఆడశిశువుల మాత్రం 37 సార్లు నవ్వుతారట.

గోడకు రకరకాల జంతువుల స్టికర్లు అతికించి పిల్లలకు వాటిని చూపి స్పందన తెలుసుకోవడం(కొందరు నవ్వుతారు... కొందరు నవ్వరు) కూడా ఈ పరిశోధనలో భాగమే. దీంతో పాటు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆడ్‌మన్ పరిశోధన తీరును చూస్తే భవిష్యత్‌లో పిల్లల నవ్వులకు సంబంధించి విలువైన సమాచారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement