బాబ్ క్రిస్టో... | Bob Christo ... the fighter | Sakshi
Sakshi News home page

బాబ్ క్రిస్టో...

Aug 30 2015 11:40 PM | Updated on Oct 2 2018 6:46 PM

బాబ్ క్రిస్టో... - Sakshi

బాబ్ క్రిస్టో...

తెలుగు సినిమాలకు బాబ్ క్రిస్టో అదనపు ఆకర్షణ. ఏదైనా మాస్ ఫైట్ ప్లాన్ చేయాలంటే బొంబాయి నుంచి పిలిపించేవారు.

ఫైటర్

తెలుగు సినిమాలకు బాబ్ క్రిస్టో అదనపు ఆకర్షణ. ఏదైనా మాస్ ఫైట్ ప్లాన్ చేయాలంటే బొంబాయి నుంచి పిలిపించేవారు. బొబ్బిలిపులిలో ఎన్‌టిఆర్‌తో బాబ్ క్రిస్టో ఫైట్ చాలా రోమాంచితంగా ఉంటుంది. ఆ ఫైట్‌లో ఎన్.టి.ఆర్ బాబ్‌ను నిజంగానే నిలువరించారని అంటారు. బాబ్ సామాన్యుడు కాడు. జన్మత: ఆస్ట్రేలియన్ అయినా సివిల్ ఇంజనీర్ అయినా తన కండలు, రూపం వల్ల సినిమాల్లో రాణించాడు. అతణ్ణి చూసి ప్రేక్షకులు భయపడేవారు. హీరోయిన్లకు స్క్రీన్ రేప్‌ల భయం ఉండేది. కాని బాబ్ క్రిస్టో స్వతహాగా స్నేహశీలి. నటుడు సంజయ్‌ఖాన్ (‘టిప్పుసుల్తాన్’ ఫేం)కు క్లోజ్‌ఫ్రెండ్. ఒకసారి సంజయ్‌ఖాన్ పక్క బంగ్లాలో మందు పార్టీ జరిగింది. ఆ పార్టీలో సంజయ్‌తో పాటు శతృఘ్నసిన్హా, సుభాష్‌ఘాయ్ కూడా పాల్గొన్నారు.

సంజయ్ ఖాన్‌కు, శతృఘ్నసిన్హాకు మాటా మాటా పెరిగింది. అందరూ శతృ వైపు బాబ్ సంజయ్ వైపు నిలబడ్డారు. గొడవ సద్దు మణిగినా ఆ రాత్రి పార్టీ జరిగిన బంగ్లాలో నుంచి సంజయ్ ఖాన్ బంగ్లాలోకి కాల్పులు జరిగాయి. రెండు బుల్లెట్లు దొరికాయి. సుభాష్ ఘాయ్‌ని ఒకరోజు స్టేషన్‌లో పెట్టారు. దీని వెనుక శతృ ఉన్నాడని పుకారు. దిలీప్ కుమార్, నర్గిస్ ఈ గొడవను తీర్చారని అంటారు. ఈ గొడవ జరిగాకే శతృఘ్నసిన్హాను ‘షాట్‌గన్’ అని పిలవడం మొదలెట్టారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement