ఆశీర్వచనాలు ఫలిస్తాయా? | Blessings are working ? | Sakshi
Sakshi News home page

ఆశీర్వచనాలు ఫలిస్తాయా?

Sep 3 2017 12:15 AM | Updated on Apr 3 2019 4:08 PM

ఆశీర్వచనాలు ఫలిస్తాయా? - Sakshi

ఆశీర్వచనాలు ఫలిస్తాయా?

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది.

సందేహం

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్‌ భవ అనీ... ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయి. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.

 ఈ ఆశీర్వచనాల వల్ల జాతక దోషాలు, మృత్యుగండాలు తొలుగుతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన తలిదండ్రులు అతడికి పెద్దలు ఎవరు ఎదురైనా వారికి పాదనమస్కారం చేయమని చెప్పారు. మార్కండేయుడు అలాగే చేసి, దీర్ఘాయుష్మాన్‌ భవ అనే ఆశీర్వాద బలంతోనే చిరంజీవి అయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement