పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు


ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మిథున్ చక్రవర్తి (నటుడు); ఇంతియాజ్ అలి (దర్శకుడు, రచయిత)

 

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సంతోషాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో పట్టు సాధిస్తారు. సద్గురువుల సాంగత్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు అనుకూలించవు కాబట్టి, వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది.

లక్కీ నంబర్స్: 1,2,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు

సూచనలు: కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, గురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం.

 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top