నునుపైన పాదాల కోసం

Beauty tips:foot special - Sakshi

బ్యూటిప్స్‌

చలికాలం పాదాల పగుళ్ల సమస్య ఎక్కువ. చర్మం త్వరగా పొడిబారడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికం. పగుళ్ల వల్ల మడమల్లో నొప్పి కూడా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. టేబుల్‌ స్పూన్‌ ఉప్పు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్, గోరువెచ్చని నీళ్లు, ప్యుమిక్‌ స్టోన్‌.. తీసుకోవాలి. ఒక వెడల్పాటి టబ్బు లేదా బేసిన్‌ లాంటిది తీసుకొని దానిని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. దాంట్లో ఉప్పు, 4టీ స్పూన్‌ నిమ్మరసం, టేబుల్‌ స్పూన్‌ గ్లిజరిన్, టీ స్పూన్‌ రోజ్‌వాటర్‌ వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను 15 నిమిషాల సేపు ఉంచాలి.

ప్యుమిక్‌స్టోన్‌ తీసుకొని పాదాల అడుగున, మడమలను రుద్దాలి.మరొకపాత్రలో టేబుల్‌ స్పూన్‌ గ్లిజరిన్, టీ స్పూన్‌ రోజ్‌వాటర్, టీ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. పడుకునేముందు పాదాలను తడి లేకుండా తుడిచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాయాలి. పాదాలకు సాక్స్‌ తొడగాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను కడగాలి. వారంలో కనీసం మూడు రోజులైనా ఈ విధంగా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ల సమస్య తగ్గిపోతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top