కరోనా: గొప్పవాడివయ్యా

Army Junior Commissioned Officer Sudhir Kumar Gave Corona Awareness To People - Sakshi

ఇండియన్‌ ఆర్మీలో జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌గా బార్డర్‌లో శత్రువులతో పోరాటం చేసే యోధుడు సుధీర్‌కుమార్‌. ఇప్పుడు కరోనా వైరస్‌పై జరిగే పోరులోనూ నేను సైతం అంటున్నాడు. సుధీర్‌కుమార్‌ వయసు 43. ప్రస్తుతం అమృత్‌సర్‌లో విధులను నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల దీర్ఘకాలిక సెలవు మీద బీహార్‌లోని మోతిహరి జిల్లా జత్వాలియా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు కూతురు పెళ్లి జరిపించడానికి. పెళ్లి కోసమని 4 లక్షల రూపాయల లోను తీసుకున్నాడు. ఈ టైమ్‌లో లాక్‌డౌన్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా మరికొన్ని రోజులు తన లీవ్‌ పొడిగించమని అతను పనిచేస్తున్న యూనిట్‌కు ముందుగానే మెసేజ్‌ పంపాడు. ఈ టైమ్‌లోనే సుధీర్‌ తన కుటుంబంతో కలిసి కరోనా వైరస్‌పై సమరశంఖం పూరించాడు. గ్రామంలో ఈ వైరస్‌కు సంబంధించిన సమాచారం ఇస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాడు. అంతేకాదు మాస్కులు సొంతంగా తయారు చేస్తూ వాటితో పాటు పేదలకు కావల్సిన నిత్యాసవసర సరుకులన్నీ ఉచితంగా అందజేస్తున్నాడు.

ఇంటి నుంచే పోరాటం..
‘మేం మా అబ్బాయిని మాస్క్‌లు కొనుక్కురమ్మని పంపినప్పుడు విపరీతమైన డిమాండ్‌ ఉందని, మాస్క్‌లు దొరకడం లేదని తెలిసింది. అంతేకాదు, ఒక్కో మాస్క్‌ చాలా ఎక్కువ ధరకు అంటే దాదాపు రూ. 200కు అమ్ముతున్నారు. అయినా, వైరస్‌కు భయపడి ఖరీదైన మాస్క్‌లు కొనాలనే జనం ఆలోచన. ఆ మాస్క్‌లను చూసిన తర్వాత వాటిని ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు సుధీర్‌. 
అతను శిక్షణ కోసం వెళ్లినప్పుడు అతని భార్య కుటుంబ పనుల్లో భాగంగా నేర్చుకున్న కుట్టుపని ఇప్పుడు సాయపడింది. దీంతో సుధీర్‌ నిర్ణయానికి కుటుంబం నుంచి వెంటనే బలం చేకూరింది. తన గ్రామంలోని ప్రజలకు ఫేస్‌మాస్క్‌లు తయారుచేసి పంపిణీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సుధీర్‌ చెప్పాడు. ఇంట్లో ఒక కుట్టు మిషన్‌ ఉంది. మరో కుట్టు మిషన్, ముసుగులు తయారు చేయడానికి కావల్సిన సరంజామాను సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరీక్ష సమయంలో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని సుధీర్‌ సంకల్పించాడు. 

రక్షణ కేంద్రంగా...
సుధీర్‌ జిల్లా వైద్యాధికారితో సంప్రదించి, అతని సూచనలతో ఈ మాస్క్‌లను తయారుచేశాడు.  భార్యతో కలిసి 4 వేల మాస్క్‌లను తయారుచేసి తమ ఊరివాళ్లకు, పొరుగూళ్లకు కూడా ఉచితంగా అందజేస్తున్నాడు.  సుధీర్, అతని కుటుంబం ‘సామాజిక దూరం’ పాటించడంలో తమ గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుధీర్‌ గ్రామం చిన్నదైనా జాగ్రత్తలు తీసుకోవడంలో రక్షణ కేంద్రంగా ఉంది. ‘రోజులో ఎక్కువ సమయం మాస్క్‌ ధరిస్తే మరో మాస్క్‌ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకెళ్లు. కానీ, దానిని ఉతికి వాడాలనుకోకు’ అని మాస్క్‌ ధరించి మరీ చెబుతున్నాడు. 

కూతురి పెళ్లికోసం దాచిన డబ్బును...
జూనియర్‌ ర్యాంక్‌ అధికారిగా ఉన్న సుధీర్‌ సంపాదన ఎక్కువేమీ కాదు. అతని సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోదు. కానీ, దేశం సంక్షోభంలో ఉన్నందున తన కూతురు పెళ్లి కోసం తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. గ్రామంలో పేదలకు కావల్సిన పప్పు, ఉప్పు, కూరగాయలను, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు సరుకులు కావాలన్నా వచ్చి తీసుకెళ్లచ్చు అని బోర్డు పెట్టి మరీ చెబుతున్నాడు. ఇతరులకు సాయం చేయడం ద్వారా నాకు డబ్బు కొరత ఉండదు. కానీ, వెలకట్టలేనన్ని ఆశీస్సులు నాకు అందుతాయి’ అని అంటున్నాడు సుధీర్‌. 
– ఆరెన్నార్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-05-2020
May 29, 2020, 00:21 IST
‘‘సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ...
28-05-2020
May 28, 2020, 20:49 IST
బెంగళూరు: కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించినట్టు వచ్చిన వార్తలపై...
28-05-2020
May 28, 2020, 18:31 IST
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా...
28-05-2020
May 28, 2020, 17:36 IST
న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్‌ మీడియాతో పాటు పలు న్యూస్‌ చానళ్లు, వెబ్‌సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు...
28-05-2020
May 28, 2020, 16:08 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం విధించిన నాలుగవ విడత లాక్‌డౌన్‌ కూడా మరో...
28-05-2020
May 28, 2020, 15:21 IST
లాక్‌డౌన్‌ నిబంధనలు సరిగా అమలు చేయకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు.
28-05-2020
May 28, 2020, 15:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నేత, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంలో...
28-05-2020
May 28, 2020, 15:00 IST
కటక్‌ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త...
28-05-2020
May 28, 2020, 14:54 IST
కొచ్చి:  కరోనా వైరస్,  లాక్ డౌన్ సమయంలో  కేరళలో దాదాపు రెండు నెలల తరువాత మద్యం అమ్మకాలకు  అనుమతి లభించడంతో మందుబాబులు తమ...
28-05-2020
May 28, 2020, 13:57 IST
సాక్షి, అనంతపురం : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జిల్లాలోని శింగనమలలో టీడీపీ నేతలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించారు. ఎన్టీఆర్‌ జయంతిని...
28-05-2020
May 28, 2020, 13:37 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: పల్లెల్లో కరోనా కల్లోలం మొదలైంది. ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు కేవలం మున్సిపల్‌...
28-05-2020
May 28, 2020, 13:16 IST
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల జీవన విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో భౌతిక...
28-05-2020
May 28, 2020, 13:14 IST
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు, పీఎస్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌...
28-05-2020
May 28, 2020, 12:39 IST
భోపాల్ : రాజ్‌భ‌వ‌న్‌లో ఒకేసారి ఆరుగురికి క‌రోనా సోక‌డం అధికార వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ్‌భ‌వ‌న్ క్వార్ట‌ర్స్‌లో నివాస‌ముంటున్న ఆరుగురికి క‌రోనా...
28-05-2020
May 28, 2020, 12:01 IST
ముంబై: నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తాను కరోనా వైరస్‌ బారిన పడ్డట్లు వెల్లడించారు మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర...
28-05-2020
May 28, 2020, 11:59 IST
ఖమ్మం: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మీవంతు బాధ్యతను నెరవేర్చండి డ్రైవర్‌ గారూ. మీ డిపోలో మాస్క్‌లు, శానిటైజర్లు ఇస్తున్నారా?’...
28-05-2020
May 28, 2020, 11:50 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి...
28-05-2020
May 28, 2020, 11:37 IST
కరోనా వైరస్‌ భయంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే క్రిమి సంహారిని శానిటైజర్‌ వాడకం...
28-05-2020
May 28, 2020, 10:52 IST
భోపాల్ :  క‌రోనా..అంద‌రి జీవితాల్లో పెను మార్పుల‌కు దారి తీసింది. పెళ్ల‌యిన కొద్ది గంట‌ల‌కే కొత్త జంట‌ను క్వారంటైన్ పాలు...
28-05-2020
May 28, 2020, 10:29 IST
కోల్‌కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top