ఇంగ్లిష్ విన్‌గ్లిష్ | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్ విన్‌గ్లిష్

Published Sun, Jul 19 2015 10:26 PM

ఇంగ్లిష్ విన్‌గ్లిష్ - Sakshi

‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’’ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాక్యమిది.
సోషల్ వెబ్‌సైట్లలో సెటైర్లకు... మిత్రుల చర్చల్లో జోకులకూ కారణమైంది.
మెయిల్‌లో లేదంటే ఇతరులకు రాసే ఇంగ్లీషు ఉత్తరంలోనో తప్పొప్పులుంటే...
కంప్యూటర్‌లోని స్పెల్‌చెక్‌తో కాకుంటే నిఘంటువుతో సరి చేసుకోవచ్చుగానీ...
మాటల్లో దొర్లే వ్యాకరణ దోషాలను దిద్దుకునేదెలా?
ముఖ్యమైన జాబ్ ఇంటర్వ్యూల్లో ఇబ్బందికరమైన పరిస్థితిని తప్పించుకునేదెలా?
చాలా సింపుల్... మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంగ్లిష్ ట్యూటర్‌గా చేసుకోండి!

 
5.  ఇంగ్లీష్ గ్రామర్ బుక్
ఏ రకమైన చెల్లింపులు లేకుండా పూర్తిగా ఉచితంగా లభించే అప్లికేషన్ ఇది. ఆప్స్ ఆఫ్ ఇండియా కంపెనీ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించడం, టేబుల్స్ ద్వారా ప్రతి అంశానికి సంబంధించిన వివరణలు ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రాక్టీస్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉన్నాయి. దాదాపు ఐదు లక్షల డౌన్‌లోడ్స్ ఉన్న ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సులువుగా ఉండటం గమనార్హం. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందివ్వడం, క్విజ్, ఎక్సర్‌సైజ్‌లను అప్‌డేట్ చేయడం తమ అప్లికేషన్ ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంటోంది.

 
4. గ్రామర్ అప్...
వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఇంగ్లీషు గ్రామర్‌ను నేర్పేందుకు ఎక్కువగా ఉపయోగపడే అప్లికేషన్ ఇది. గ్రాఫ్‌ల ద్వారా వ్యాకరణంలో మీ బలం ఏమిటి? బలహీనతలేమిటి అన్నది తెలుపుతుంది. నిర్దిష్ట సమయంలోపు గ్రామర్ నేర్చుకోవాలనుకునే వారి కోసం దీంట్లో ఓ టైమర్‌ను ఏర్పాటు చేశారు. రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్ ద్వారా మీరు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా వేగంగా, మెరుగ్గా నేర్చుకునేందుకు అవకాశముంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల కోసం ‘గ్రామర్ అప్ లైట్’ ఉచితం. పూర్తిస్థాయి వెర్షన్ కావాలంటే ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.150 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

 
గ్రామర్ యాప్
వ్యాకరణం నేర్చుకోవడాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని గందరగోళంలో ఉన్న వారికి గ్రామర్ యాప్ మెరుగైన ఛాయిస్. గ్రామర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని 200 వరకూ ఉన్న లెర్నింగ్ ఆప్షన్స్, దాదాపు వెయ్యి ప్రశ్నల ద్వారా నేర్చుకునే వీలుంది. ట్యుటోరియల్స్‌ను చూడటంతోపాటు, ఎక్సర్‌సైజ్‌ల ద్వారా మీ ఇంగ్లీష్ రాతను మరింత మెరుగు పరచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ అప్లికేషన్. మీరు ఎంతవరకూ నేర్చుకున్నదీ అక్కడికక్కడే ఫీడ్‌బ్యాక్ కూడా అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు దాదాపు రూ.70 చెల్లించి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఇది ఉచితంగా లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్‌లో స్క్రీన్ క్లారిటీ హెచ్‌డీలో ఉండటం దీనికి కారణం.

 
గ్రామరో పోలిస్: ఈ అప్లికేషన్ మొత్తం ఓ ఆట మాదిరిగా ఉంటుంది. ‘సిటీ ఆఫ్ గ్రామర్’ అన్న పేరుతో సాగే ఈ ఆట ద్వారా భాషా విభాగాలను (పార్ట్స్ ఆఫ్ స్పీచ్) నేర్చుకోవచ్చు. ఒక్కో భాషా విభాగం సిటీలోని ఒక్కో ప్రాంతం మాదిరిగా ఉంటుంది. మీరు ఈ సిటీలో నామవాచకాల ప్రాంతం నుంచి క్రియ లకు ఆ తరువాత మరో భాషా విభాగా నికి వెళుతూ విషయాలను నేర్చుకుంటా రన్న మాట. ఒక్కో అంశం మీకు ఎంతమేరకు అబ్బిందో తెలుసుకునేం దుకు కొన్ని క్విజ్‌లు ఉంటాయి. వీటితోపాటు వీడియోలు, బుక్స్, పాటల ద్వారా గ్రామర్‌ను నేర్చుకోవడం దీని ప్రత్యేకత. గ్రామరోపోలిస్ ప్రాథమిక వెర్షన్ ఉచితంగా లభిస్తుందిగానీ.. కంప్లీట్ వెర్షన్ కోసం మాత్రం ఆండ్రాయిడ్‌లోనైతే దాదాపు రూ.600, ఐఫోన్లలోనైతే రూ.800 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

 
ప్రాక్టీస్ ఇంగ్లీష్ గ్రామర్
ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకూ ఉచితంగా లభించే అప్లికేషన్ ఇది. వ్యాకరణం నేర్చుకోవడాన్ని ఆటలా చేసే అప్లికేషన్ ఇది. ఫ్లాష్‌కార్డ్స్, ప్రశ్నలు, కథనాలు వంటివి కలిగి ఉన్న ఈ అప్లికేషన్ ద్వారా టెన్సెస్ (కాలం) మొదలుకొని పాసివ్ వాయిస్ వరకూ అనేక వ్యాకరణ అంశాలను నేర్చుకోవచ్చు. ఫ్లాష్‌కార్డుల ద్వారా గ్రామర్ అంశాలను నేర్చుకోవడం, క్విజ్‌ల ద్వారా వాటిని పరీక్షించడం ఇందులోని ముఖ్యమైన ఫీచర్లు. క్విజ్‌వరల్డ్ సంస్థ అందించిన ఈ ఆప్‌లో బిగినర్, ఎలిమెంటరీ, ఇంటర్మీడి యట్, అడ్వాన్స్‌డ్ అన్న నాలుగు మాడ్యూళ్లు ఉన్నాయి.

 
గ్రామర్ ఫోన్: ఇది కూడా ఐఫోన్ వినియోగదా రులకు మాత్రమే ఉద్దేశించింది. వ్యాకర ణంలో మనం చేసే దాదాపు 25 ప్రధానమైన తప్పులను దిద్దుకునేందుకు సహకరిస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ సింపుల్‌గా ఉండటం ఒక విశేషమైతే తరచూ మనం గందరగోళంలో పడే పదాలను ఎప్పటికప్పుడు వివరించడం మరో విశేషం. ఆపిల్ ఆప్‌స్టోర్‌లో దాదాపు రూ.60కి లభించే ఈ అప్లికేషన్ ద్వారా మీ ఇంగ్లీష్ రాతలో వచ్చే ప్రధానమైన తప్పులను పరిహరించుకోవచ్చు.


 
గ్రామర్ గర్ల్...
ఇది ఆపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉన్న అప్లికేషన్. పాడ్‌కాస్ట్‌ల రూపంలో ఇంగ్లీష్ గ్రామర్‌ను నేర్పిస్తుంది. ఎప్పటికప్పుడు గ్రామర్‌కు సంబంధించిన టిప్స్‌ను వినిపిస్తూ, గ్రామర్ సంబంధిత వాల్‌పేపర్లను అందిస్తూంటుంది ఈ అప్లికేషన్. అడిగిన వాటితోపాటు అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం, వివరణలు ఇవ్వడం దీని ప్రత్యేకత. చదవడం లేకుండా వినడం మాత్రమే కాబట్టి ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా గ్రామర్ నేర్చుకోవచ్చు.



- గిళియార్

Advertisement
 
Advertisement
 
Advertisement