'చంద్రబాబు పాలనలో ప్రజలు వలసపోయారు' | ys vijayamma blames chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పాలనలో ప్రజలు వలసపోయారు'

Apr 21 2014 7:22 PM | Updated on Jul 25 2018 4:09 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు.

తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ఆయన పాలనలో ప్రజలు వలస వెళ్లిపోయారని ఆమె విమర్శించారు. ఈ రోజు జిల్లాలోని ప్రత్తిపాడు ఎన్నికల రోడ్ షోకు హాజరైన ఆమె జన నీరాజనాలు అందుకున్నారు. అక్కడకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన విజయమ్మ.. చంద్రబాబు పాలనలో ప్రజలు వలసబాట పట్టారన్నారు. టీడీపీ ఏ పథకాల మీద అధికారంలోకి వచ్చిందో.. ఆ తర్వాత వాటిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరిచిపోయారన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు రాకపోవడం కారణం చంద్రబాబేనన్నారు.

 

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్ట్‌లను ఆయన ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సింగపూర్ తిరిగి.. ఆంధ్రప్రదేశ్‌ను శ్మశానంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విజయమ్మ తెలిపారు. రైతులు, మహిళలు, పేదలకు భరోసా ఇచ్చిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డేనని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ఆయనలో తెగువ, తపన జగన్ లో ఉన్నాయని విజయమ్మ తెలిపారు. సుపరిపాలన అవసరమనుకుంటే మంచి నేతనే ఎన్నుకోవాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement