'నన్నెందుకు ఓడిస్తున్నారు....' | somireddy chandramohan reddy Chafing on election compaigning | Sakshi
Sakshi News home page

'నన్నెందుకు ఓడిస్తున్నారు....'

May 6 2014 9:27 AM | Updated on Aug 10 2018 8:06 PM

'నన్నెందుకు ఓడిస్తున్నారు....' - Sakshi

'నన్నెందుకు ఓడిస్తున్నారు....'

టీడీపీ సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

''ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో సేవ చేశాను! అలాంటిది నన్నేందుకు ఓడిస్తున్నారో అర్ధం కావటం లేదు'' అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం చిన్న చెరుకూరులో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పదేళ్లపాటు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయితే ఓటర్లు తనను రెండుసార్లు ఓడించారని, ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసారి ఓటర్లు ఆలోచించి తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. వాస్తవానికి రెండు సార్లు సర్వేపల్లి నుంచి ఓడిపోవడంతో ఈసారి తనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని సోమిరెడ్డి చాలా గట్టి ప్రయత్నమే చేశారు. అయితే అది కాస్తా పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. అసలు తాను ఈసారి పోటీకి దిగేది లేదని, ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని అలిగారు. కానీ చంద్రబాబు ఆయనను బుజ్జగించి, బరిలోకి దింపారు. కానీ ప్రచారపర్వంలో అడుగడుగునా పరిస్థితి అవగతం అవుతుండటంతో ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement