'ఈ ఐదేళ్ళలో ప్రజల కోసం పోరాడింది జగనన్నే' | Sharmila promises brother Jagan Reddy will begin era of development | Sakshi
Sakshi News home page

'ఈ ఐదేళ్ళలో ప్రజల కోసం పోరాడింది జగనన్నే'

Apr 26 2014 7:42 PM | Updated on Jul 28 2018 6:43 PM

ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత షర్మిల పునరుద్ఘాటించారు.

అనంత:ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత షర్మిల పునరుద్ఘాటించారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని మడకశిరలో ప్రసంగించిన షర్మిల.. ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు చేపట్టిన సంగతిని గుర్తు చేశారు. జగనన్న పదవుల వదులుకుని జైలుకు వెళ్లాడని ఆమె తెలిపారు. అక్కడ కూడా అన్న ప్రజల పక్షానే నిలిచాడని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రం, దేశంలో రెండు సార్లు కాంగ్రెస్‌కు రెండు సార్లు అధికారం కట్టబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కే దక్కుతుందన్నారు.

 

అలాంటి వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి కాంగ్రెస్ కు కుట్రలకు పాల్పడిందన్నారు. వైఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా తెలుగు ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆ పార్టీ తెలుగు ప్రజలపై కక్ష కట్టి రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. అంతటి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న చంద్రబాబు కనీసం నిలదీయకుండా కుతంత్ర రాజకీయాలు చేశారని షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయిన తర్వాత  వైఎస్ఆర్ ప్రతి పథకానికి జీ వం పోస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement