బ్యాలెట్ బాక్స్లో రూ.10 నోటు | Rs. 10 note in ballot box at karlapalem | Sakshi
Sakshi News home page

బ్యాలెట్ బాక్స్లో రూ.10 నోటు

May 13 2014 9:43 AM | Updated on Aug 24 2018 2:33 PM

బ్యాలెట్ బాక్స్లో రూ.10 నోటు - Sakshi

బ్యాలెట్ బాక్స్లో రూ.10 నోటు

గుంటూరు జిల్లా కర్లపాలెం బ్యాలెట్ బాక్స్ లో విచిత్రం చోటుచేసుకుంది.

గుంటూరు : గుంటూరు జిల్లా కర్లపాలెం బ్యాలెట్ బాక్స్ లో విచిత్రం చోటుచేసుకుంది. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటుతో పాటు ఓ పది రూపాయల నోటు బయటపడింది. కాగా నల్లమోతువారిపాలెం బ్యాలెట్ బాక్స్ లో నాలుగు ఓట్లు గల్లంతు అయ్యాయి. మరోవైపు జిల్లాలోని 57 జడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాల ఫలితాలపై అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు బెట్టింగ్ రాయుళ్లలోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 6,11 తేదీల్లో జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

57 జడ్పీటీసీ స్థానాలకు 208 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2,374 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పల్లె తీర్పు ఎలా ఉండబోతోందనే అంచనాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. వీరి భవిష్యత్తు మంగళవారం సాయంత్రానికి తేలనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement