ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ పథకాలను నిర్వీర్యం చేసిందని ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.
ఒంగోలు: ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ పథకాలను నిర్వీర్యం చేసిందని ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. జగన్ సీఎం అయిన వెంటనే వైఎస్‌ఆర్ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తారని చెప్పారు. రాష్ట్రాభివృద్దిపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు.
15 రోజులు ఆగండి, రాజన్న రాజ్యం వస్తుందని ఆయన ప్రజలకు భరోసాయిచ్చారు. జగన్ సీఎం అయ్యాక ప్రతి పేదవాడికి రూ.వందకే కరెంట్ ఇస్తారని, అప్పటిదాకా పేదలెవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని సూచించారు.