రాజకీయ పార్టీలు తమను విస్మరిస్తే స్వతంత్రంగా పోటీ చేసేందుకైనా వెనుకాడబోమని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
సాక్షి,హైదరాబాద్: రాజకీయ పార్టీలు తమను విస్మరిస్తే స్వతంత్రంగా పోటీ చేసేందుకైనా వెనుకాడబోమని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థినేతలంతా ఆర్ట్స్ కళాశాలలో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను రాజకీయపార్టీలు విస్మరిస్తూ టికెట్లు అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. తాము పదవుల మీద ఆశతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తెలంగాణ నవనిర్మాణంలో భాగస్వాములు కావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే...
టీఎస్ జేఏసీ చైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్(నల్లగొండ పార్లమెంట్), అధ్యక్షుడు దేశగాని సాంబశివ(హుజూర్‌నగర్ అసెంబ్లీ), జేఏసీ నేతలు బొమ్మ హనుమంతరావు(పాలేరు), పుప్పాల మల్లేష్( సూర్యపేట), బాలలక్ష్మి (జనగాం), సల్మాన్‌బాబు (సత్తుపల్లి), రవితేజారెడ్డి (పాలకుర్తి) నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.