మున్సిపోలింగ్ 76.95 శాతం | Muncipal polling 76.95 per cent | Sakshi
Sakshi News home page

మున్సిపోలింగ్ 76.95 శాతం

Mar 31 2014 2:39 AM | Updated on Jul 11 2019 8:26 PM

దురుమదురు సంఘటనలు మినహా ఆదివారం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.95 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాం తంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.95 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో   మొత్తం 129 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 536 అభ్యర్థులు బరిలో నిలిచారు.  
 
విజయనగరంలో 40 వార్డుల్లో 169 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డులలో 117 మంది, సాలూరులో  29 వార్డుల్లో 95 మంది, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వారు స్థానాలకు 155 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాలు మినహా సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. 

విజయనగరం మున్సిపాలిటీలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియగా... ఈవీఎంలు మొరాయించడంతో సాలూరు మున్సిపాలిటీలో 13 వార్డులో అరగంట ఆలస్యంగా, పార్వతీపురం మున్సిపాలిటీలో 8,15 వార్డులలో   గంటన్నర ఆలస్యంగా, బొబ్బిలి మున్సిపాలిటీలో  4, 10, 14,12, 20 వార్డుల్లో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
 
అదే మున్సిపాలిటీలో 10, 7 మున్సిపాలిటీల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం ఏడు గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. నేతల భవితవ్యం నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలను ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచినట్టు   ఎన్నికల అధికారి ఆర్.సోమన్నారాయణ తెలిపారు.
 
అందరి దృష్టి ఫలితాలపైనే....
మున్సిపల్ ఎన్నికలు సజావుగా ముగియడంతో బరిలో  నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది.  పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయా పార్టీల నేతలు తమకు దక్కే ఓట్ల లెక్కలను బేరీజులు వేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 ఫలితాలు ప్రకటించవలసి ఉన్నప్పటికీ సాధారణ  ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందని హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఫలితాల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 1న ఫలితాల ప్రకటనపై ైెహ కోర్టు తీర్పునివ్వాల్సి ఉంది.
 
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 76.95 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో  అత్యధికంగా బొబ్బిలి మున్సిపాలిటీలో 80.14 శాతం నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం మున్సిపాలిటీలో 69.01 శాతం ఓట్లు నమోదయింది. సాలూరు మున్సిపాలిటీలో 79.72 శాతం, పార్వతీపురం మున్సిపాలిటీలో 78.93 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చుకుంటే ఈ సారి ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రంగం తీసుకున్న చర్యల వల్ల పోలింగ్ శాతం ఘననీంగా పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement