హవ్వా.. వన్సైడ్ లవ్వా! | K Narayana attack on CPM, TRS alliance Proposal | Sakshi
Sakshi News home page

హవ్వా.. వన్సైడ్ లవ్వా!

Apr 4 2014 2:24 PM | Updated on Jul 11 2019 9:08 PM

హవ్వా.. వన్సైడ్ లవ్వా! - Sakshi

హవ్వా.. వన్సైడ్ లవ్వా!

పదునైన మాటలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడం సీపీఐ నారాయణ స్టయిల్.

పదునైన మాటలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడం సీపీఐ నారాయణ స్టయిల్. వెనుకాముందు ఆలోచించకుండా పరుష పదజాలంతో ఎవరినైనా కడిగిపారేయడం ఆయన ప్రత్యేకత. ఎంత పెద్ద నాయకుడి పైనా విమర్శలు చేసినా ఆయన మాటల వాడి తగ్గదు. తాజాగా తన సహచర కామ్రేడ్ నాయకుడు తమ్మినేని వీరభద్రంపై 'ప్రేమ పూర్వక' విమర్శలు చేశారు.

టీఆర్ఎస్ పొత్తుకు సుముఖంగా ఉన్న సీపీఎం వైఖరిని 'లవ్ కామెంట్స్'తో ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్తో సీపీఐ కలిసి వెళ్లడాన్ని సీపీఎం తప్పుబట్టింది. దీనిపై నారాయణ స్పందిస్తూ.. ఏ సిద్ధాంతం ప్రకారం టీఆర్ఎస్ను సీపీఎం వన్సైడ్ లవ్ చేస్తోందని గట్టిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కట్టుబడిన సీపీఎం, విభజనకు కోరుకున్న టీఆర్ఎస్తో కలిసి వెళ్లడానికి సిద్ధపడడాన్ని ఏమంటారని నిలదీశారు.

సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీఆర్ఎస్ను వన్సైడ్ లవ్ చేస్తున్నా... కేసీఆర్ తిరిగి చేయడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన 'వన్సైడ్ లవ్' నారాయణ పుణ్యమాని రాజకీయాలకూ పాకింది. ఒకవైపు ప్రేమ పాలిటిక్స్లో ఫలిస్తుందో, లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement