
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆసక్తికర కామెంట్ చేశారాయన.
‘‘కవిత అసలు ఎందుకు బయటకు వస్తోంది?. బీఆర్‌ఎస్‌లో డెమోక్రసీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబుకు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయాడు. ప్రాంతీయ పార్టీల్లో ప్రాపర్టీ, పలుకుబడి అంతా కుటుంబం కోసమే. పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్(Kavitha Episode) చూస్తున్నాం’’ అని అన్నారాయన.
ప్రాంతీయ పార్టీల్లో డెమోక్రసీ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అతి డెమోక్రసీ ఉంది. ఆ పార్టీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటుంది. ఇది పరిపాలనపై ప్రభావం చూపెడుతుంది. ఎన్నికైన సీఎంకు స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగానీ పదే పదే పగ్గాలు పెట్టి లాగొద్దు’’ అని సూచించారు.
ఆపరేషన్ కగార్‌పైనా స్పందిస్తూ.. చంపినంత మాత్రాన నక్సలిజం పోదు. ఇంకా పెరుగుద్ది. మనుషులను చంపగలరు గాని సిద్ధాంతాన్ని చంపగలరా?. ఇది అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం’’ అని నారాయణ ఆరోపించారు.
ఇదీ చదవండి: తప్పుడు కేసా? కాదా? అనేది మేం తేలుస్తాం