
'పరిటాలకు భయపడి పారిపోయిన జేసీ సోదరులు'
పరిటాల రవి దెబ్బకు ఒకప్పుడు జేసీ సోదరులు పారిపోయారని ఎంపీ అనంతవెంకట్రామి రెడ్డి అన్నారు.
తాడిపత్రి: పరిటాల రవి దెబ్బకు ఒకప్పుడు జేసీ సోదరులు పారిపోయారని ఎంపీ అనంతవెంకట్రామి రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే టీడీపీలో జేసీ సోదరులు చేరుతుండడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ సోదరులకు భయపడవద్దని, నిర్భయంగా ఓటేయాలని ప్రజలకు ధైర్యం చెప్పారు. 23న టీడీపీలో చేరుతున్నట్టు మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి నిన్న ప్రకటించారు.
సమైక్యాంధ్ర అనలేని పరికిపంద చంద్రబాబు అని అనంత వెంకట్రామిరెడ్డి అంతకుముందు విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వనీతే విభజనకు కారణమని, నయవంచకుడైన చంద్రబాబును నమ్మితే మరోసారి ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. వైఎస్ జగన్ వల్లే వైఎస్ఆర్ ఆశయాల సాధన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.