ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు ముగింపు పలకాలంటూ బీజేపీ నేత సీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేకెత్తించాయి.
ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు ముగింపు పలకాలంటూ బీజేపీ నేత సీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేకెత్తించాయి. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అయిన ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఆయన స్పందించారు.
అయితే, ఠాకూర్ వాదనను బీజేపీ మిత్రపక్షం అయిన ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ కొట్టిపారేశారు. రిజర్వేషన్లు అనేవి సమాజంలో బలహీనవర్గాలు, దళితుల హక్కని, అవి కొనసాగి తీరాల్సిందేనని పాశ్వాన్ చెప్పారు. విపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ కూడా ఠాకూర్ను విమర్శించాయి.