 
															చిరంజీవి అభిమానులకు కాంగ్రెస్ టిక్కెట్
కేంద్ర మంత్రి చిరంజీవి అభిమానులకు శాసనసభకు పోటీచేసేందుకు టిక్కెట్ ఇవ్వడానికి సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అంగీకరించారు.
	హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి అభిమానులకు శాసనసభకు పోటీచేసేందుకు టిక్కెట్ ఇవ్వడానికి సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అంగీకరించారు.  చిరంజీవి ఈ రోజు ఇందిరా భవన్‌లో తన అభిమానులతో సమావేశమయ్యారు. ఎన్నికల విషయమై చర్చించారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించమని వారు అడిగారు.
	
	అనంతరం చిరంజీవి అభిమానులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్లు  రఘువీరారెడ్డి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
