బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి.
గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. అద్వానీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఈ ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్తో పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
2009 లోక్సభ ఎన్నికల సమయంలో 3.5 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులు ఉన్నాయని, ఐదేళ్లలో వీటి విలువ రెట్టింపు అయ్యిందని అద్వానీ పేర్కొన్నారు. గుర్గావ్లో రెండు ఇళ్లు, గాంధీనగర్లో ఓ ఇల్లు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ 5.57 కోట్ల రూపాయిలుగా చూపారు. అద్వానీ పేరిట 97.23 లక్షలు, ఆయన భార్య పేరిట 67.13 లక్షల రూపాయిల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. అద్వానీ దగ్గర 25 వేలు, భార్య దగ్గర 15 వేలు నగదు ఉందని తెలిపారు. తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని అద్వానీ తెలిపారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు.